Uttar Pradesh: వారి నిర్లక్ష్యంతో శవాన్ని చేతులపై..

Uttar Pradesh: ఒకప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి కష్టాలు తీర్చేందుకు బంధువులతో పాటు చుట్టు పక్కల వారు సైతం ముందుకు కదిలేవారు. నేటి కాలంలో తాము.. తమ కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనను వింటే ఛీ.. ఇదేం పాడులోకం అనక తప్పడం లేదు. సవతి తల్లి ఆగ్రహానికి మృత్యువాత పడిన తన తమ్ముడి శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ ఇవ్వాలని బతిమిలాడినా ఇవ్వకపోవడంతో ఓ పదేళ్ల బాలుడు ఆ శవాన్ని తన చేతులపై ఇంటి వరకూ మోసుకెళ్లాల్సిన వచ్చింది.

ఈ విశాధకర ఘటన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ప్రజలు చలించిపోతున్నారు. పదేళ్ల సాగర్‌ కుమార్‌ తన చేతుల్లో రెండేళ్ల తమ్ముడు మృతదేహాన్ని పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. నిజానికి ఆ రెండేళ్ల బాలుడు సవతి తల్లి ఆగ్రహానికి బలయ్యాడు. బాలుడు ఏడుపు ఆపడం లేదని సవతి తల్లి సీత ఆ చిన్నారిని కారుకింద తోసేయడంతో కొట్టుమిట్టులాడుతూ చిన్నారి కళాకుమార్‌ ప్రాణాలు పోయిన ఘటన ఢిలీ–సహారన్‌పూర్‌ హైవేలోని బాగ్‌పట్‌లోని బ్యాంకు సమీపంలో జరిగింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సవితి తల్లిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. బాలుడి ఇంటికెళ్లి చిన్నారి∙మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా.. పోస్ట్‌మార్టం తర్వాత ఆస్పత్రిలో అంబులెన్స్‌ ఇవ్వకపోవడంతో సొంతంగా ఓ వాహనాన్ని పెట్టుకునే స్థోమత లేకపోవడంతో ∙మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. తమ్ముడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వాహనాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు ఆస్పత్రి సిబ్బందిని కోరినా వారు కనికరించకపోవడంతో తప్పని పరిస్థితులో శవాన్ని చేతుల్లో తీసుకెళ్లాడు. ఓ చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వని ఆస్పత్రిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -