2022 Movies: వామ్మో.. ఈ ఏడాది ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయా?

2022 Movies: తెలుగు చలన చిత్ర సీమ ఈ మధ్య పాన్ ఇండియా చిత్రాలతో ఆకట్టుకుంటుంది. అద్భుతమైన చిత్రాలు, కమర్షియల్ చిత్రాలు, భారీ బడ్జెట్ మూవీలు ఎన్నో సినీ ప్రపంచానికి అందిస్తోంది టాలీవుడ్. ఇలా ఎన్నో చిత్రాలు హిట్స్ గా, హీరోలు స్టార్స్ గా మారుతున్న అదే సమయంలో.. కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. ఈ సంవత్సరం డిజాస్టర్ గా మారిన టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల వివరాలు మీకోసం..

ఆచార్య: ఎన్నో అంచనాలతో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ మూవీ ఆచార్య. ఏప్రిల్ 29న విడుదలై, 80 కోట్ల నష్టాలను తీసుకువచ్చింది.
రాధే శ్యామ్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన రాధే శ్యామ్ మార్చ్ 11న విడుదలైంది. మొత్తంగా 120 కోట్ల నష్టాలు మూటకట్టింది.
లైగర్: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కకించిన చిత్రం లైగర్.. 65 కోట్ల నష్టాలను తెచ్చిపెట్టింది.
లాల్ సింగ్ చద్దా: అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా.. 180 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది.

బాలీవుడ్ లో..
రణబీర్ కపూర్ డబుల్ యాక్షన్ లో కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన చిత్రం షంషేరా. అట్టర్ ఫ్లాప్ అయింది ఈ మూవీ.
“సామ్రాట్ పృథ్వీరాజ్” భారీ అంచనాలతో వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ లిస్టులో ఇంకా చాలానే సినిమాలు ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ ఖిలాడి, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, వరుణ్ తేజ్ గని వంటివి. అయితే ఆయా హీరో, హీరోయిన్ల అభిమానులు ఈ సినిమాలను ఆదరించినప్పటికీ మొత్తం మీద చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -