Wedding Crime: వీడు సామాన్యుడు కాదురా బాబోయ్.. పట్టుమని 30 ఏళ్లు కూడా లేవు కానీ ఏకంగా ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడా?

Wedding Crime: నేటి కాలంలో అబ్బాయిలకు వివాహం కావాలంటే ఎంతో కష్టతరంగా మారింది. పిల్లనిచ్చే తల్లిదండ్రులు అబ్బాయి ఆస్తిపాస్తులను అతని కుటుంబ గుణగణాలను వారి ఉద్యోగాన్ని ఆరా తీస్తూ అన్ని లక్షణాలు సక్రమంగా ఉంటేనే అబ్బాయిలకు పెళ్లిళ్లు జరగడం కష్టతరమవుతుంది అలాంటిది తమ జీవితానికి తాడు బొంగరం లేకుండా ఉంటే అలాంటి వారికి పెళ్లిళ్లు జరగడం చాలా కష్టంగా మారింది.

ఈ విధంగా కొంతమంది సంపాదన లేక పెళ్లిళ్లకు దూరమవుతుంటే మరికొందరు జాతక దోషాల వల్ల పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకుంటున్నారు. అయితే ఈ ఘనుడు మాత్రం పట్టుమని 30 ఏళ్లు కూడా లేవు కానీ ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రబుద్ధుడు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…

పశ్చిమబెంగాల్ ప్రాంతానికి చెందిన అసబుల్ మొల్లా(28) పెళ్లిళ్ల పేరుతో యువతులను పట్టుమని 30 ఏళ్లు కూడా కాకుండానే ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకొని అమ్మాయిలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. అసబుల్ బీహార్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించి ఇలాంటి మోసానికి పాల్పడుతున్నారు. ఇలా ఈయన నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించి తన ఊరి పేరు అన్ని మార్చి చెబుతూ ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ ఏకంగా 24 మంది యువతులను వివాహమాడారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని సాగర్దిగ్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఇదివరకు యువతులను మోసం చేసినట్టు తన దగ్గర కూడా డబ్బు, నగలను తీసుకొని పారిపోవడంతో ఆ యువతి మోసపోయానని గ్రహించి ఈ విషయాన్ని యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు అసబుల్ ను పట్టుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయట పెట్టాడు.ఇలా 28 సంవత్సరాలకు 24 పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది తెలిసిన ఎంతోమంది యువకులు మాకు ఒక పెళ్లికి దిక్కులేదు 24 పెళ్లిళ్లు ఎలా అయ్యాయి రా బాబు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

YS Jagan: జగన్ తప్ప ఎవరూ కష్టపడటం లేదా? అందుకే ఇలాంటి ఫలితాలా?

YS Jagan: రాజకీయాల తీరే వేరుగా ఉంటుంది. ఎప్పుడు ఏ నాయకుడు ఆకాశానికి ఎగురుతాడో, ఏ నాయకుడు పడిపోతాడో అస్సలు లెక్క గట్టలేం. ఇదంతా ప్రజల దీవెనల మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా...
- Advertisement -