దారుణం: నిర్లక్ష్యంతో పాపకు అంత్యక్రియలు చేయబోయారు.. చివరికి?

ఒక్కసారి ప్రాణాలు పోయాయంటే ఇక అంతే.. దేవుడు సైతం చనిపోయిన వారి కళ్లు తెరిపించలేడు. ఒకవేళ చనిపోయిన వారు కళ్లు తెరిచారంటే అది కౖలైన ఉండాలి.. లేదా సినిమాలోనైనా ఉండాలి. కానీ.. నిజ జీవితంలో చనిపోయిన వారు కళ్లు తెరవడం ఊహకే పరిమితం. వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించిన మూడేళ్ల పాపకు అంత్యక్రియాలు జరుపుతుండా కళ్లు తెరిచిన ఆశ్చర్యకర ఘటన మెక్సికోలో జరిగింది. ఒక్కసారి లేచి. ‘నేను బతికే ఉన్నాను.. అంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. బతికున్న తమ పాపను ఆసుపత్రిలో వైద్యల నిర్లక్ష్యంతో చనిపోయిందని చెప్పారని తల్లి చిన్నారి పేర్కొంది.

విల్లా డీ రమోస్‌ ప్రాంతంలో నివాసముంటున్న కమిలా రోక్సానా అనే మహిళకు మూడేళ్ల కూతురు కమిలా రోక్సానా మార్టినెజ్‌ మెన్డోజా ఉంది. ఉప్పట్టుండి ఆ పాపకు తీవ్రమైన జ్వరం, వాంతులు, కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యబందం మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సలహా ఇచ్చారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు ‘పారాసిటమల్‌’ వేయాలని ప్రిస్క్రిప్షన్‌ కూడా ఇచ్చారు. అక్కడి నుంచి పెద్ద ఆస్పత్రికి పాపను తీసుకెళ్లే లోపు ఆ చిన్నారి ఆరోగ్యం మరింత విషమించింది. వైద్య పరీక్షలు చేసిన పెద్దసుపత్రి వైద్యులు కొన్ని మెడిసిన్‌ ఇచ్చారు. పాపకు పండ్లు, నీళ్లు తాపాలని సూచించారు. వైద్యులు చెప్పిన విధంగా చేసినా పాపాలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత వైద్యులు ఎమర్జెన్సీ గదికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ ప్రారంభించారు. పది నిమిషాల పాటు ఇంట్రావీనస్‌ ద్రవాలను ఎక్కించిన తర్వాత వాటిని తొలగించి చనిపోయినట్లు నిర్ధారించారని తల్లి పేర్కొంది.

డీహైడ్రేషన్‌ కారణంగా పాపా చనిపోయిందని వైద్యులు తెలిపారు. చేసేది లేక ఏడుస్తూ పాపాని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. చిన్నారిని ఉంచిన శవ పేటికలో ఓ గాజు ముక్క గాలిలో తెలుతుండటాన్ని గమనించిన పాపా తల్లి ఈ విషయాన్ని ఇతర బంధువులకు తెలుపగా వారు అంతగా పట్టించుకోకుండా కొట్టిపారేశారు. ఆ తర్వాత చిన్నారి కళ్లు కదిలించినట్లు ఆమె బామ్మ కూడా గమనించి వెంటనే తెరిచి చూడగా నాడి కొట్టుకుంటుంది. హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యంతో బతికిఉన్న పాపను చనిపోయిందని నిర్ధారించిన ఆస్పత్రి, వైద్యులపై చర్యలు తీసుకోవాలని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -