Free Smartphone: 30 వేలకే ఉచితంగా స్మార్ట్ ఫోన్.. కామెంట్ చేస్తే చాలు?

Free Smartphone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నథింగ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే ఈ నథింగ్ సంస్థ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే అయితే నథింగ్ బ్రాండ్ ఫౌండర్ కార్ల్ పి అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. ఉచితంగా స్మార్ట్‌ ఫోన్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ట్విట్టర్‌లో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. అందులో కేవలం తన ట్వీట్‌కు కామెంట్ చేస్తే సరిపోతుంది. మీ కామెంట్‌కు ఎవ్వరూ లైక్ కొట్టకపోతే మీకు నథింగ్ ఫోన్ 1ను ఉచితంగా పొందే అవకాశం పొందవచ్చు.

 

అలాగే ఎక్కువ లైక్స్ పొందిన కామెంట్‌కు ఉచితంగా నథింగ్ స్మార్ట్‌ఫోన్ 1 లభిస్తుంది. అయితే విన్నర్ ఎవరు అన్నది 24 గంటల్లోగా ప్రకటిస్తారు. అంటే ఇద్దరికి ఉచితంగానే నథింగ్ స్మార్ట్‌ఫోన్స్ లభిస్తాయన్నమాట. కానీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్ ను పొందటం కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కామెంట్‌కు లైక్స్ ఉన్నాయి. అందువల్ల ఉచితంగా స్మార్ట్‌ఫోన్ పొందటం అన్నది కష్టమే. ఒక్క లైక్ రాకపోయినా అలాగే ఎక్కువ లైక్స్ వచ్చినా కూడా ఫోన్ ఉచితంగా వస్తుంది. అందువల్ల ఎక్కువ లైక్స్ పొందే వారికి మాత్రం ఉచిత ఫోన్ పొందేందుకు అవకాశం ఉంటుంది.

 

కాగా ఈ నథింగ్ ఫోన్ 1 మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 27,499 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు వర్తిస్తుంది. అలాగే 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 30,499గా ఉంది. అదేవిధంగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. రూ. 33,499గా ఉంది. ఈ ఫోన్లు అన్నీ ఆన్‌లైన్‌లో ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. కాగా నథింగ్ ఫోన్ 1లో 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 50 ఎంపీ డ్యూయెల్ కెమెరా,16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778 జీ ప్లస్ ప్రాసెసర్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -