5G phone: అతి తక్కువ ధరకే 5 జీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

5G phone: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలె భరత మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌ లో మూడు మొబైల్స్ ను రిలీజ్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. కాగా అవి రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది రెడ్‌మీ సంస్థ. కాగా ఈ మొబైల్స్ రూ.15,000, రూ.20,000, రూ.25,000 బడ్జెట్‌లో రిలీజ్ అయ్యాయి. ఇకపోతే రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫీచర్లు ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తున్న ఈ ఫోన్ ధర రూ.26,999 కాగా, 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తున్న ఈ ఫోన్ ధర రూ.29,999 గా ఉంది.

 

అయితే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే ఈ మొబైల్ ఫోన్ పై రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు ఈ ఆఫర్‌తో 8జీబీ, 256జీబీ వేరియంట్‌ను రూ.25,999 ధరకు అలాగే 12జీబీ 256జీబీ వేరియంట్‌ను రూ.28,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.3,000 లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.23,000 వరకు లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో కొంటే రూ.10,000 లోపే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ సేల్ జనవరి 11 అనగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అయ్యింది. ఈ మొబైల్ ఫోను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇతర ఆఫర్స్ విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. కేవలం నెలకు రూ.5,000 ఈఎంఐతో ఈ మొబైల్ కొనొచ్చు.

 

కాగా ఈ రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200మెగాపిక్సెల్ శాంసంగ్ HPX సెన్సార్ 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండడం ఉంది. కేవలం 19 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే చాలు 100% చార్జింగ్ అవుతుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఐస్‌బర్గ్ బ్లూ, ఆబ్సిడియన్ బ్లాక్ కలర్స్‌ లో లభిస్తోంది

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -