Viral: మీ ఇంట్లో పిల్లలున్నారా.. ఇది వెంటనే చదవండి!

Viral: సాధారణంగా పసిపిల్లలు అంటే దేవుడితో సమానం అని అంటూ ఉంటారు. వారికి ఆకలేసినప్పుడు, తల్లి పాలు తాగి పడుకోవడం ఆడుకోవడం తప్ప ఆ పసి పిల్లలకు ఇంకేమీ తెలియదు. అంతేకాకుండా ఏది మంచో ఏది చెడో అసలు తెలియవు. అయితే చిన్నపిల్లలు ఏదైనా గాని చేతికి దొరికితే చాలు వెంటనే నోట్లోకి పెట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు అవి పసిపిల్లల ప్రాణాలు కూడా తీస్తూ ఉంటాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఏది కనిపిస్తే దానిని నోట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలోనే తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.

అంతేకాకుండా పిల్లలు ఎటువంటి వస్తువులను ముట్టుకోకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే ఒక తల్లి పిల్లాడి విషయంలో ఏమరపాటుగా ఉండడంవల్ల ఆ పసిపిల్లాడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని బారామతికి చెందిన కార్తీక్ సింగ్ అనే 8 నెలల బాలుడు అకస్మాత్తుగా పాలు తాగడం మానేశాడు. అలా అని ఆ పసిపిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ పిల్లాడు ఉన్నట్టుండి పాలు తాగడం మానేసి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడంతో వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆ పిల్లవాడిని పరీక్షించిన వైద్యులు అడ్డుగా ఉందని గుర్తించి ఎక్స్రే తీయాలని చెప్పారు. తీరా ఎక్స్రే తీసిన తర్వాత ఆ రిపోర్ట్ ని చూసి డాక్టర్లతో పాటు తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. ఆ బాలుడు గొంతులో మహిళలు వేసుకునే ఒక కాలిమెట్టి కనిపించింది. దాన్ని చూసి కంగు తిన్న ఆ తల్లిదండ్రులు రోజుల క్రితం పోయిన తన కాలిమెట్టె తన కుమారుడి శ్వాస నాలంలో చూసి ఆ తల్లి తల్లడిల్లి పోయింది. ఆ బాలుడు తల్లి కాలిమెట్టెను నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్న సమయంలో అనుకోకుండా మింగేసాడు అయితే ఆ పిల్లవాడి తల్లి తన కాలిమెట్టు కనిపించకపోయేసరికి ఎక్కడో ఉంటుందని భావించింది. కానీ అది తన కొడుకు గొంతులోకి వెళ్లి అతని ఇబ్బంది పెడుతుందని ఆ తల్లి పసిగట్ట లేకపోయింది. ఆ తర్వాత డాక్టర్లు ఆ పిల్లవాడికి ఆపరేషన్ చేసి శాసనాలంలో ఉన్న కాళిమెట్టును బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం బాగానే ఉంది. ఎప్పటిలాగే పాలు తాగుతూ ఆడుకుంటున్నాడు. తమ కుమారుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో అతని దండలు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -