Chittoor: 97వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేసిన 47 ఏళ్ల వ్యక్తి?

Chittoor: ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వయసుతో పని లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుని అనవసరంగా ప్రాణాల మీద కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ వివాహేతర సంబంధాలకు ఎన్నో ప్రాణాలు బలైన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డి కాలనీలో సయ్యాద్ మౌలాలీ అనే 47 ఏళ్ళ వ్యక్తి నివసిస్తుండేవాడు.

 

మౌలాలి స్థానికంగా ఉండే చెరువులను లీజుకు తీసుకుని జీవనాన్నికొనసాగిస్తున్నాడు. కాగా మౌలాలికి సరళమ్మ అనే 97 ఏళ్ల ఒంటరి మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. ఇక మౌలాలి సరళమ్మ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా మౌలాలి సరళమ్మ ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే సరళమ్మకు పరాయి మగాళ్లతో పరిచయాలు ఉన్నాయి అని తెలుసుకున్న మౌలాలి ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. గొడవలు జరిగిన నేపథ్యంలో ఇద్దరి మధ్య మాట పెరిగి కోపంతో రగిలిపోయిన మౌలాలి సరళమ్మను దారుణంగా హత్య చేశాడు.

 

అంతటితో ఆగకుండా ఆమె శవాన్ని రాళ్లకు తాళ్ళతో కట్టి ఎవరికీ కనిపించకుండా స్థానికంగా ఉండే ఒక ప్రాజెక్టులో పడేశాడు. మరుసటి రోజు నుంచి సరళమ్మ కనిపించకుండా పోవడంతో సరళమ్మ తల్లి మౌలాలిని నిలదీయగా ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఇక అదే రోజు రాత్రి సరళమ్మ తల్లిని కూడా మౌలాలి గొంతు పిసికి దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఆమె శవాన్ని కూడా చెరువులో ఉన్న ఒక చెట్టుకి తాళ్లతో కట్టేశాడు. అంతటితో ఆగని మౌలాలి సరళమ్మ కూతురిపై కూడా కన్నేసి ఆమెపై పలసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే మౌలాలిపై సరళ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మౌలాలీని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనపై మహిళా న్యాయస్థానం సోమవారం తీర్పును ఇస్తూ నిందితుడు మౌలాలీకి మరణించేంత వరకు జైలులోనే ఉండేలా శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అతనికి రూ. 10 వేల జరిమానా విధిస్తూ, సరళమ్మ కూతురికి రూ.5 లక్షల నష్టపరిహారం అందించాలని న్యాయస్థానం జారీ చేసింది.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -