Banana Flower: అరటి పువ్వుతో అలాంటి సమస్యలకు చెక్?

Banana Flower: అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అరటిపండు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతోపాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే మనకు కూరగాయల మార్కెట్లో అరటికాయలతో పాటుగా అరటి పువ్వులు కూడా అమ్ముతూ ఉంటారు.. చాలామంది అరటి పువ్వును కావాలనే కొనుగోలు చేసి వాటిని తింటూ ఉంటారు. అరటికాయతో పాటు అరటి పువ్వు వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పువ్వులో టానిన్లు, ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. అదేవిధంగా అరటి పువ్వు గర్భాశయ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. గర్భం లోపలి సమస్యలకు అరటి పువ్వు సహజసిద్ధంగా పనిచేస్తుంది. అరటి పువ్వు తినడం వల్ల మానసికంగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆందోళనను తగ్గించి ఆరోగ్యం బాగా ఉంచుతుంది. ఇక అరటిపువ్వులో ఉండే మెగ్నీషియం డిప్రెషన్ ను దూరం చేస్తుంది. అరటిపువ్వు స్త్రీల సమస్యకు పరిష్కారం చూపుతుంది. పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, వెన్నునొప్పి, ఇతర సమస్యలకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.

 

అరటి పువ్వులు ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో ఈ పువ్వు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటి పువ్వును కొబ్బరితో కలిసి తినడం మంచిది.అలాగే బాక్టీరియా వృద్ధిని నిరోధించడంలో అరటిపువ్వు సహాయపడుతుంది. మిమ్మల్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేస్తుంది. జ్వరం, జలుబు, విరేచనాల సమస్యకు పరిష్కారం చూపుతుంది అలాగే ఉడికించిన అరటిపువ్వును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్లు ఆందోళన చెందకుండా తినాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -