Producer: భార్య అనుమానం.. ప్రముఖ నిర్మాత ఏం చేశాడో తెలుసా?

Producer: సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ కామన్ అయ్యాయి. పెళ్లి చేసుకున్న చాలా మంది వేరే అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకుంటారు. అయితే ఇది సీక్రెట్‌గానే కొనసాగిస్తారు. కానీ విషయం బయటపడినప్పుడు మాత్రం తరచూ వార్తల్లోకి నిలుస్తుంటారు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమల్ కిశోర్ మిశ్రా తన భార్య పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. కారులో వెళ్తున్న మిశ్రాను తన భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మిశ్రా కారును ఆమెపై పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆమె కాళ్లపై నుంచి కారు వెళ్లింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాల ప్రకారం.. సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా మరో మహిళతో పట్టుబడ్డారు. కారులో వేరే మహిళతో వెళ్తున్నప్పుడు అతని భార్య అడ్డుకుంది. దీంతో కోపోధ్రిక్తుడైన మిశ్రా భార్యపై కారును ఎక్కించాడు. దీంతో ఆమె కాలుపై కారు ఎక్కింది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అక్టోబర్ 19న అంధేరిలోని తన నివాసభవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న చిత్ర నిర్మాత మిశ్రాకు, అతని భార్యకు మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పార్కింగ్ స్పాట్‌లో భార్య గొడవపడటంతో చిత్ర నిర్మాతకు, అతని భార్యకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో మిశ్రా భార్యపై కారు ఎక్కింది. దీంతో మిశ్రా భార్యకు కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అంబోలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్), సెక్షన్ 337 (వ్యక్తిగత భద్రతకు హాని కలిగించేలా గాయపర్చడం), ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -