Prabhas: కేజీఎఫ్2 మించిన ఫైట్.. ప్రభాస్ రేంజ్ ఇదే!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మరియు అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నటనకు యావత్ ప్రపంచం సాహో అంటూ దాసోహమైంది. మొదటినుంచి సెన్సేషనల్ చిత్రాలు చేస్తూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్.. ప్రస్తుతం తన పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

 

 

బాహుబలి తర్వాత ఎన్నో భారీ అంచనాల నడుమున రిలీజ్ అయిన సాహో మరియు రాధేశ్యామ్ అనుకున్నంత ఆడలేదు. దాంతో రాబోయే సినిమాల మీద ఇంకా శ్రద్ధ తీసుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. ఆయన చేస్తున్న మరో భారీ సినిమా ‘ప్రాజెక్ట్ కె’. దీంతోపాటే ప్రభాస్ చేస్తున్న మరో చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్. ఈ చిత్రంలో ప్రభాస్ ఏకంగా రెండు వేల మందితో ఓ ఫైట్ సీన్ చేయబోతున్నట్టు సమాచారం.

ఈ చిత్రం విజువల్స్ పరంగా కూడా వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా పై కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ నెట్టింట సెన్సేషన్ అయింది. కేజీఎఫ్ తర్వాత మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అన్బు-అరివు. లేటెస్ట్ గా ఈ బ్రదర్ ఇద్దరు ప్రభాస్ సినిమా సెట్ లో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

కేజీఎఫ్ తర్వాత వీళ్లు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి ఫైట్స్ ను కంపోజ్ చేయగా.. అవి జనాలను విపరీతంగా ఆకట్టుకోవడం తెలిసిందే. ‘విక్రమ్’ మూవీలో ఫైట్స్ ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోపక్క కేజీఎఫ్ 2 లో హాలీవుడ్ లెవెల్ ఫైట్ సీన్స్ ను ప్లాన్ చేసి సూపర్ అనిపించారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ ప్రభాస్ మూవీ లో ఫైట్స్ డిజైన్ చేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -