Hyderabad: వంట వివాదం.. దారుణ హత్యకు పాల్పడిన రూమ్‌మేట్!!

Hyderabad: నేటిసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురై ప్రాణాలను తీసుకుంటున్నారు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చిపోతున్నారు. తాజాగా ఓ ఇద్దరి రూమ్‌మేట్స్ మధ్య తలెత్తిన వివాదం ఒక్కరి ప్రాణాలను బలికొంది. ఈ ఘటన ఈ నెల 16న హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కుమార్ సహాని, రణ్‌విజయ్ సింగ్ ఇద్దరు స్నేహితులు. హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఒక అపార్ట్‌ మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో గత ఆదివారం సాయత్రం వంట చేసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో రణ్‌విజయ్ సింగ్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.

కానీ రణ్‌విజయ్ సింగ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక తను దాడి చేసిన వ్యక్తి మరణించడంతో ఖంగుతిన్న రాజ్ కుమార్ సహాని అక్కడి నుండి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అప్పటికే నిందితుడు పారిపోయి ఉండటంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇక రాజ్ కుమార్ ఉత్తర ప్రదేశ్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. అందుకోసం అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని, రైలు ఎక్కాడు. అతడు మధ్యలో నాగ్‌పూర్ సమీపంలో ఫోన్ స్విచ్ఛాన్ చేయడంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు.. నిందితుడి ప్రయాణిస్తున్న రైలును గుర్తించి, రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. హైదరాబాద్ పోలీసులు నిందితుడి ఫొటో, ఇతర వివరాలు స్థానిక పోలీసులకు పంపించారు. కాగా.. దక్షిణ ఎక్స్‌ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నిందితుడిని పోలీసులు నాగ్‌పూర్ పరిధిలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -