Lion Attack: సింహం సింగిల్ గా కాదు.. గుంపులుగా ఎలా వేటాడాయో చూస్తే గూస్ బంప్ రావాల్సిందే!

Lion Attack: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే వీడియోల రూపంలో అందరికీ తెలిసిపోతుంది. ముఖ్యంగా అడవిలో ఎన్నో రకాల క్రూర జంతువులు వేటకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. ఇకపోతే అడవికి రాజు అయినటు వంటి సింహం వస్తుందంటే ఆ పరిసర ప్రాంతాలలో ఎలాంటి జంతువులు కూడా క్షణం పాటు నిలబడవు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తుంటాయి.

సింహం ఒక్కసారి గర్జించి తన వేటను ప్రారంభిస్తే ఎలాంటి పెద్ద జంతువునైనా ఎంతో సునాయసంగా లొంగ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ప్రాణి అడవిలో ఎంతో భయభయంగా సంచరిస్తూ ఉంటాయి. అయితే పొరపాటున ఏ జంతువు అయినా సింహం చేతికి దొరికింది అంటే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో సింహం సింగిల్ గా కాకుండా గుంపులుగా అడవి దున్న పై దాడి చేశాయి.ఈ దాడిలో సింహాలు ఆ దున్న మధ్య పెద్ద ఎత్తున భయంకరమైన యుద్ధం జరిగింది. సింహాల దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ దున్న ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సింహాలు గుంపులుగా వెళ్లి దానిపై ఒక్కసారిగా దాడి చేయడంతో చేసేదేమీ లేక చివరికి తన ప్రాణాలపై ఆశలను వదులుకోవాల్సి వచ్చింది.

ఇలా సింహాలు మొత్తం ఒక్కసారిగా దున్న పై దాడి చేయడంతో ఈ వీడియో చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. ఏది ఏమైనా భయంకరంగా సింహాలతో పోరాడిన ఆ దున్న చివరికి సింహాలకు ఆహారంగా కాక తప్పలేదు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది హృదయ విదారక ఘటన అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొందరు సింహాలు బ్రతకాలంటే ఇతర జంతువులు ఆహారం కావాల్సిందే ఇది సృష్టి ధర్మం అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -