Virat: విరాట్ కోహ్లీకి భారీ షాక్ తప్పదా.. అసలేం జరిగిందంటే?

Virat: 2007 జరిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యంతో ధోనీ సూప‌ర్ స్టార్ అయిన విషయం తెలిసిందే. అయితే అప్పటికీ సచిన్ అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా స‌చిన్ కు ధీటుగా ఎండోర్స్ మెంట్ డీల్స్ ను ధోనీ సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో స‌చిన్ స్థాయిని అధిగ‌మించాడు. దేశీయ యాడ్ మార్కెట్ లో ధోనీ టాప‌ర్ గా నిలిచాడు. ఇక అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి స‌చిన్ రిటైర్మెంట్ త‌ర్వాత పూర్తిగా ధోనీ హ‌వా కొన‌సాగింది.

 

ఆ తర్వాత కొంత కాలానికే విరాట్ కొహ్లీ వచ్చాడు. ఆ సమయంలో అంత‌ర్జాతీయ క్రికెట్ లో సెంచ‌రీల విష‌యంలో స‌చిన్ త‌ర్వాత ఉన్న‌ది విరాట్ కొహ్లీనే. కేవ‌లం సెంచ‌రీల హీరోనే కాదు ప‌రుగులు సంఖ్య‌లో కూడా ఓవ‌రాల్ గా స‌చిన్ త‌ర్వాతి స్థానాన్ని కొహ్లీనే పొందే అవ‌కాశాలున్నాయి. కాగా కొహ్లీ పొందిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, యాడ్ మార్కెట్ లో అత‌డి లీడ‌ర్ స్థానం గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ధోనీని అధిగ‌మించి కోహ్లీ ఎప్పుడో నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే..

ఈ మధ్య కాలంలో కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ క్ర‌మంగా త‌గ్గుతోంది. గ‌త రెండు మూడేళ్లుగా విరాట్ కొహ్లీ ఫామ్ అంతంత మాత్ర‌ం గానే ఉంది. అయితే మంచి ఊపు మీద ఉన్న‌ప్పుడు వెనుక‌బ‌డిన కొహ్లీ ఆ త‌ర్వాత మునుప‌టి స్థాయిలో పుంజుకోలేక‌పోతున్నాడు. ఏదో ఆడుతున్న అంతే ఆడుతున్నా అన్నట్లు మూడేళ్ల కింద‌టి కోహ్లీకి, ప్ర‌స్తుత కోహ్లీకీ చాలా తేడా ఉంది. అప్పుడు కొహ్లీ సెంచ‌రీలు బాదుతూ ఉంటే అందరూ చ‌ప్ప‌ట్లు కొట్టారు కానీ ఇప్పుడు వేరే వాళ్లు ఆడుతుంటే కోహ్లీ చ‌ప్ప‌ట్లు కొడుతున్నాడు.

 

కోహ్లీ ప్ర‌ద‌ర్శ‌నలో మునుప‌టి లాగా అద్భుతాలు లేవు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా కోహ్లీ వెనుక‌బ‌డడం ఆశ్చర్యపోయే విషయం. మ‌రోవైపు క్రికెట్ లో కొత్త కెర‌టాలు వ‌స్తున్నాయి. దీంతో కొహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ త‌గ్గుతోంది. అలాగే మొన్న‌టి వ‌ర‌కూ కూడా ర‌ణ్ వీర్ ది కోహ్లీ త‌ర్వాతి స్థాన‌మే. కానీ ఇప్పుడు ఆ స్థానాలు మారిపోయాయి. కొహ్లీని దాటేసి ర‌ణ్ వీర్ తొలి స్థానాన్ని పొందాడు. ఇలా క్రికెట్ క్రేజ్ ను బాలీవుడ్ జ‌యించింది. అలాగే ర‌ణ్ వీర్ యాడ్ రెవెన్యూ ప్ర‌స్తుతం ఏడాదికి 18 కోట్ల డాల‌ర్ల స్థాయిలో ఉంది. కోహ్లీ 17 కోట్ల డాల‌ర్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. 2020లో కొహ్లీ ఈ మార్గంలో సుమారు 23 కోట్ల డాల‌ర్ల ఆదాయాన్ని పొందాడు. ఇప్పుడు 17 కోట్ల డాల‌ర్ల స్థాయికి అత‌డి మార్కెట్ రేంజ్ త‌గ్గింది.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -