బలవంతంగా పెళ్లి చేసుకుందంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్న యువకుడు.. చివరికి!?

ప్రస్తుత సమాజంలో బలవంతపు వివాహాలు ఆడవారికి మాత్రమే కాదు, మగవారికి కూడా జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో దాన్ని కాలమే నిర్ణయిస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు. మానవ వివాహాలు దైవ నిర్ణయం అని, మన పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పూర్వికులు చెబుతూ ఉండేవారు.

అలాంటి ఒక బలవంతపు పెళ్లి చేసుకున్న ఒక భర్త పురుగుల మందు తాగి సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. అదిలాబాద్ జిల్లా బొక్కలగూడలో ఫిరోజ్ అనే యువకుడు తన భార్య తనను బలవంతంగా పెళ్లి చేస్తుందని, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తనను మానసికంగా వేధిస్తుందని అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

పురుగుల మందు తాగిన ఫిరోజ్ మతిస్థిమితం లేకుండా పడిపోయాడు. ఫిరోజ్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువగా ఆడవారికి జరగడం మనం చూస్తుంటాం. కానీ కాలం మారుతూ వస్తుంది ప్రస్తుత కాలంలో ఇలాంటి వేధింపులు భార్యల వల్ల చాలామంది భర్తలు మానసికంగా వేదనకు గురవుతున్నారని చెప్పవచ్చు.

ఇలా వేదనకు గురైన వారిలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని మరణించిన వారు కూడా ఉన్నారు. మనదేశంలో మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అలాగే భార్యల వల్ల వేధింపులకు గురవుతున్న భర్తల కోసం కూడా ప్రత్యక చట్టాలను తీసుకురావాలని చాలామంది భర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న దారుణాలను బట్టి రాబోయే రోజులలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో, ఎన్ని దారుణాలు వినాలో అని కొంత మంది భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -