Matrimonial Advertisement: ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలంటే పురోహితులను.. లేక తెలిసిన బంధువులు సంప్రదించేవారు. రాను రాను ఆ సంప్రదాయం కనుమరుగైంది. ఇప్పుడంతా మ్యారేజ్ బ్యూరోలు, మ్యాట్రీమోనీలను సంప్రదిస్తున్నారు. ఇంకొందరు పేపర్ యాడ్స్ ఇస్తున్నారు. యాడ్స్‌లో వరువు, వధువుల వృత్తి, కలర్, ఉండాల్సిన గుణాలు తదితరలను యాడ్స్‌లో పెడుతున్నారు. మరి కొందరైతే తమకు కచ్చితంగా ఇలాంటి అబ్బాయి లేదా అమ్మాయి ఇవే గుణాలు ఉండాలని మరీ ప్రకటిస్తునాన్రు. తాజాగా ఓ అమ్మాయి ఇచ్చిన యాడ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే మాకొద్దంటూ ఆ యాడ్‌లో ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం.
ధనిక వ్యాపార కుటుంబంలోని ఎంబీఏ పూర్తిచేసిన వధువుకు ఐఏఎస్/ఐపీఎస్, వైద్యుడు, పారిశ్రామికవేత్త,వ్యాపారవేత్త అయిన వరుడు కావాలి’ అని ప్రకటిస్తూనే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మాత్రం కాల్ చేయొద్దు’ అంటూ స్పష్టం చేశారు. కాగా ఈ ప్రకటనకు సంబంధించిన క్లిప్పింగ్ వ్యాపారవేత్త సమీర్ అరోరా ట్విటర్ లో షేర్ చేస్తూ ’ఐటీ భవిష్యత్తు సజావుగా కనిపించడం లేదు’ అనే వ్యాఖ్యలు జోడించారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
దేశంలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఉన్నారనే అర్థం వచ్చేలా.. అరోరా వ్యాఖ్యలను ఓ యూజర్ ఉటంకిస్తూ అయితే.. దేశ ప్రజల భవిష్యత్తు సజావుగా లేదు’ అంటూ స్పందించాడు. ఐటీ లేకపోతే దేశ భవిష్యత్తు సరిగా ఉండదు. అంటూ మరో యూజర్ పేర్కొన్నాడు. ’మేం అంత చెడ్డవాళ్లమా అంటూ మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ఆవేదన వెలిబుచ్చాడు. ‘దేవుడా ధన్యవాదాలు.. నాకు 11ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటంతో అమ్మాయి, అబ్బాయిలు వాళ్ల వాళ్ల రీతులో కామెంట్లు గుప్పిస్తున్నారు.