Iphone 14: ఐఫోన్ 14 లుక్స్ పోలి ఉండే ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?

Iphone 14: స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ మంది కోరుకునేది, ఇష్టపడేది ఐఫోన్ అని చెప్పవచ్చు. చాలామంది ఐఫోన్ కనీసం ఒక్కసారైనా ఉపయోగించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇటీవల యాపిల్ సంస్థ విడుదల చేసిన ఫోన్ లలో ఐఫోన్ 14 కూడా ఒకటి. ఐఫోన్ 14 ని కొనుగోలు చేయాలి అంటే కనీసం లక్ష రూపాయలు అయినా ఉండాల్సిందే. కానీ అచ్చం ఐఫోన్ 14 లుక్స్ తో ప్రస్తుతం కేవలం రూ. 10 వేలకే లభిస్తోంది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా చైనా కు చెందిన LeEco అచ్చంగా ఐఫోన్‌ 14ని పోలి ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

LeEco ఎస్ 1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ చూడడానికి ఐఫోన్‌ 14ని పోలినట్లు ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ధర విషయానికి వస్తే.. ఇందులో 6.5 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ను అచ్చంగా ఐఫోన్‌లా కనిపించడానికి ప్రధాన కారణం దీని కెమెరా అని చెప్పొచ్చు. LeEco ఎస్1 ప్రోలో రియిర్‌ కెమెరాలో మూడు లెన్స్‌ని అందించారు. ఇకపోతే కెమెరా క్లారిటీ విషయానికొస్తే.. 13 మెగా పిక్సెల్‌ కాగా సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 10 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని సామర్థ్యంను కలిగి ఉండనుంది.

LeEco ఎస్ 1 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యంతో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్లో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ని చైనాలో మాత్రమే తీసుకొచ్చారు. అయితే భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. ఇకపోతే ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో చైనా కరెన్సీలో 899 యువాన్‌లుగా ఉంది.అనగా మన కరెన్సీ ప్రకారం రూ. 10,906గా ఉంది. మరి ఐఫోన్ 14 పోలికలతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -