Haryana: చిన్న పొరపాటు చేసిన గర్భవతి.. భర్త ఏం చేశాడంటే?

Haryana: తాజాగా హర్యానాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక భర్త తన భార్య నాలుగు నెలల గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా నడిరోడ్డు పైన హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అసలేం జరిగిందంటే.. హర్యానా హిసార్ లోని అగ్రోహ బ్లాక్ ప్రాంతంలో రోషన్ లాల్ రాజ్ బాలా దంపతులు నివసిస్తున్నారు. వీరికి 2013లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. దీంతో ఈ భార్యాభర్తల కాపురం ఎంతో సంతోషంగా సజావుగా సాగుతూ వచ్చింది.

 

ఇది ఇలా ఉంటే రోషన్ లాల్ భార్య రాజ్ బాలా స్థానికంగా ఉండే ఒక వ్యక్తితో వివాహేతర పెట్టుకోవడంతో అంతేకాకుండా భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలా భర్తకు తెలియకుండా కొన్నాళ్లపాటు ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు భార్య రహస్య కాపురం గురించి భర్తకు తెలియడంతో ఆమెను మందలించి తన బుద్ధి మార్చుకోమని హెచ్చరించాడు. అయినా తన తీరు మార్చుకోని ఆమె ప్రియుడితో చాలాసార్లు శారీరకంగా కలుస్తూ వచ్చింది. మంచి మాటలతో చెబితే తన భార్య మాట వినదు అని భావించిన భర్త రోషన్ లాల్ పెద్ద మనుషులతో పంచాయితి పెట్టించాడు.

 

పెద్దలందరూ ఇద్దరికీ సర్ది చెప్పి బుద్దిగా ఉండాలంటూ హెచ్చరించారు. ఇలా కొన్నాళ్ల పాటు అతని భార్య సైలెంట్ గానే ఉంది. అలా కొన్ని రోజులు గడిచిందో లేదో ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి 10 నెలల కిందట లేచిపోయింది. దూరంగా ఉంటూ ప్రియుడితోనే కాపురం పెట్టింది. అయితే భార్య చేసిన పనికి పరువు పోయిందని భర్త తరుచు బాధపడేవాడు. కొన్ని రోజుల తర్వాత భార్య గర్భం దాల్చిందని తెలుసుకున్నాడు. ఇక అతని కోపం మరింత ఎక్కువైంది. ఎలాగైన సరే భార్య రాజ్ బాలాను చంపాలని అనుకున్నాడు. బుధవారం ఆమె ఆస్పత్రి నిమిత్తం బయటకు వచ్చింది. ఇదే మంచి సమయం అనుకున్నా భర్త భార్య 4 నెలల గర్బిణీ అని కూడా చూడకుండా ఆస్పత్రి ముందే అతి కిరాతకంగా నరికాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంటాడి మరి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -