Ragging: కాలేజీలో ర్యాగింగ్‌.. బలవంతంగా ముద్దు పెట్టి వీడియో తీసి?

Ragging: ర్యాగింగ్‌ భూతాన్ని అరికట్టేందుకు దేశంలోని అన్ని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా వాటికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ ర్యాగింగ్‌కి ఎందరో విద్యార్థి, విద్యార్థులు ప్రాణాలు గొట్టుకుంటున్నారు. కష్టపడి ర్యాంకులు సాధించి ఉన్నత చదువులకు వెళ్దామంటే ర్యాగింగ్‌కు భయపడి కొందరు విద్యార్థులు ఉన్నత చదువులను దూరం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ర్యాగింగ్‌ అంటే కాసేపు ప్రశ్నలు అడగడం, పరిగెత్తించడం జరిగేది. నేటికాలంలో ర్యాగింగ్‌లో హద్దు మించి ప్రవర్తిసున్నారు. అమ్మాయిల ముందు బట్టలు విప్పించడం అమ్మాయిలను బలవంతంగా తాగించడం చేస్తు జూనియర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

 

తాజాగా ఒడిశాలో జరిగిన ర్యాగింగ్‌ దేశమంతా కలకలం రేపుతోంది. సీనియర్‌ విద్యార్థులు ఇద్దరు జూనియర్లు( అమ్మాయి, అబ్బాయి)లను పిలిపించి అమ్మాయికి ముద్దు పెట్టాలని ఆదేశించారు. దీంతో అమ్మాయి నేను ఒప్పుకోనని దూరంగా వెళ్తుండగా ఓ సీనియర్‌ ఆ అమ్మాయి వెండ్రుకలు పట్టి కిందకూర్చుబెట్టాడు. ఇంకో జూనియర్‌ విద్యార్థితో అ అమ్మాయికి ముద్దు పెట్టాలని చెప్పగా ఆ అబ్బాయి భయంతో వణికిపోతాడు. కోపోద్రిక్తుడైన సీనియర్‌ విద్యార్థి ముద్దు పెట్టని విద్యార్థి చెంపపై కొట్టి ఇంకో విద్యార్థిని పిలిపించి బలవంతంగా ముద్దు పెట్టిస్తాడు. ఈ ఘటన మొత్తం ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో బయటకు వచ్చింది.

ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్న కళాశాల యాజమాన్యం 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించింది. ఈ ఘటన జరిగేటప్పుడు చాలా మంది విద్యార్థులు, విద్యార్థినులు అక్కడే ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా ఆపేందుకు ప్రయత్నం చేయకపోవడమే కాకా కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తోటి విద్యార్థులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -