Kane: వన్డే ప్రపంచకప్‌కు ముందు కివీస్‌కు ఎదురుదెబ్బ.. కేన్ మామ దూరం

Kane: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమన్స్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేన్ విలియమన్స్ కు గాయాలయ్యాయి. దీంతో పూర్తిగా ఈ ఐపీఎల్‌కు కేన్ విలియమన్స్ దూరమయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఫీల్టింగ్ చేస్తున్న సమయంలో కేన్ విలియమ్సన్ మోకాలికి గాయమైంది. ఆయనను పరీక్షించిన వైద్యులు. . సర్జరీ అవసరమని సూచించారు. సర్జరీ తప్పనిసరిగా చేయాల్సిందేనని చెప్పారు.

దీంతో కేన్ విలియమ్సన్ ఇండియా నుంచి న్యూజిలాండ్ కు వెళ్లాడు. స్వదేశానికి వెళ్లిన తర్వాత మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోగా.. సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. దీంతో కేన్ విలియమ్సన్ కాలికి వచ్చే మూడు వారాల్లో సర్జరీ చేయనున్నారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ కు కూడా కేన్ మామ దూరం కానున్నాడు. భారత్ వేదికగా అక్టోబర్-నవంబర్ లో ప్రపంచకప్ జరగనుంది. గాయం కారణంగా ప్రపంచకప్‌కు కూడా కేన్ మామ దూరం కానున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

న్యూజిలాండ్ కోచ్ గేరీ స్టీడ్ ఈ విషయంపై కీలక ప్రకటన చేశాడు. ప్రపంచకప్ స్టార్ట్ అయ్యే లోపు కేన్ విలియమ్సన్ కోలుకోవడం కష్టమేనని, సాధ్యమయ్యే పరిస్థితే కనిపించడం లేదని అన్నారు. ఇక కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ఇలాంటి గాయాలు తీవ్ర నిరాశను కల్గిస్తాయని, వీలైనంత త్వరగా గ్రౌండ్ లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తానంటూ చెప్పారు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకోవడంపై దృష్టి పెడతానని చెప్పారు.

 

అయితే కేన్ విలియమ్సన్ కుడి మోకాలి లిగ్మెంట్ లో చీలిక పడిందని తెలుస్తోంది. దీంతో సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ తర్వాత ఫిట్ గా మారడానికి మరింత సమయం పడుతుంది. దీంతో కేన్ విలియమ్సన్ వన్డే ప్రపంచకప్ కి అందుబాటులో లేకపోతే కివీస్ జట్టుుకు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు

 

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -