Actress Prema: ఒకప్పటి హీరోయిన్ ప్రేమ జీవితంలో చోటు చేసుకున్న విషాదాలు ఇవే!

Actress Prema: టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి అందాల భామ ప్రేమ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రేమ.. మోహన్ లాల్, హీరో వెంకటేష్, జగపతిబాబు, మోహన్ బాబు, సాయికుమార్, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలో సరసన నటించింది. వెంకటేష్ హీరోగా నటించిన ధర్మచక్రం సినిమాతో ప్రేమ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ కన్నడ లో చిన్నతనం నుంచే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలు తో ప్రేమ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక దేవి సినిమాతో ప్రేమ తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఇక ప్రేమను కెరీర్ పరంగా ముందుకు నడిపించిన సినిమా అని కూడా అదే అని చెప్పవచ్చు. ఇక ప్రేమ టాలీవుడ్ లోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

మరి ప్రేమ కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంతగా కనిపించలేదు. అప్పట్లో ప్రేమకు సినీ అవకాశాలు కూడా కొంచెం తగ్గు ముఖం పట్టాయి. అప్పట్లో ప్రేమ కన్నడ హీరో ఉపేంద్ర తో కొంతకాలం ప్రేమాయణం నడిపిందని తర్వాత వీళ్ళిద్దరూ మనస్పర్ధలు వచ్చి విడిపోయారని వార్తలు వచ్చాయి. ఇక 2006లో ప్రేమ జీవన్ అప్పచ్చు అనే బిజినెస్ మెన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందట.

ఇక కొన్ని సంవత్సరాలు వీరిద్దరూ దాంపత్య జీవితం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ భార్యాభర్తల బంధానికి బ్రేక్ అప్ చెప్పుకున్నారు. ఇక విడాకులైన తర్వాత ప్రేమ ఇంత వరకు విడాకుల గురించి ఎప్పుడూ స్పందించలేదు. ఇలా ప్రేమ మొదటి భర్తతో విడాకులు తీసుకోవడంతో తన అభిమానులు ఎంతో బాధపడ్డారు. అంతేకాకుండా రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితంతో హ్యాపీగా ఉంటుంది అనుకుంటే అది లేకుండా పోయిందన్నట్లు ప్రేమ అభిమానులు బాధపడుతున్నారు. ప్రస్తుతం ప్రేమ ఫిలిం ఇండస్ట్రీలో తల్లి పాత్రలో కనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -