Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేదీ: సెప్టెంబర్ 16
నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ , శ్రీకాంత్ అయ్యంగర్.
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్.
నిర్మాత: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి.
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : మార్తాండ్ కె. వెంకటేష్

Aa Ammayi Gurinchi Meeku Cheppali Review and Rating

కథ : నవీన్ ( సుధీర్ బాబు) వరుస విజయాలతో దూసుకెళ్తున్న సినీ దర్శకుడు. ఇక తన నెక్స్ట్ సినిమాను ప్రిన్సెస్ లాంటి అందమైన అమ్మాయితో చేయాలనుకుంటాడు. దానికోసం కథ సిద్ధంగా లేకపోయినా అతనికి అనుకోకుండా ఒక రీల్ దొరుకుతుంది. ఆ రీల్ లో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఎవరో అని అక్కడ ఇక్కడ ఎంక్వయిరీ చేస్తాడు. అప్పుడు ఆమె కంటి వైద్యురాలు అయిన డాక్టర్ అలేఖ్య అని తెలుసుకుంటాడు.

ఆ తర్వాత ఎలాగైనా ఆమెను తన సినిమాలో చేయడానికి ఒప్పించాలని అనుకుంటాడు. వెళ్లి ఆమెను సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి ఆఫర్ చేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం తనకి తన కుటుంబానికి సినిమాలు అంటే అస్సలు నచ్చవని నవీన్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరిస్తుంది. తర్వాత అలా చెప్పిన ఆ అమ్మాయి కొన్ని కారణాలవల్ల నటించడానికి ఒప్పుకుంటుంది. ఆమె ఒప్పుకోవడానికి కారణం ఏంటి? అలేఖ్యకి నవీన్ కు మధ్య సంబంధం ఏంటి? నవీన్ సినిమా తీశాడా లేదా? అన్నదే మిగతా కథలోనిది.

నటీనటుల పనితీరు: సుధీర్ బాబు కృతి శెట్టి జంట బాగా ఆకట్టుకుంది. దర్శకుడి పాత్రలో సుధీర్ చాలా బాగా నటించాడు. కృతి శెట్టి కూడా తన పాత్రలో బాగా నటించింది. ఆమెకు ఇచ్చిన పాత్రకు ఆమె న్యాయం చేసిందని చెప్పాలి. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు బాగా నటించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ బాగా నవ్వించారు.

విశ్లేషణ: సాంకేతికంగా సినిమా బాగా ఉంది. దర్శకుడు ఇంద్రగంటి కమర్షియల్ సినిమాల వాతావరణాన్ని మళ్లీ చూపించారు. అలాగే సినిమాలో మాత్రం కమర్షియల్ హంగుల్ని జోడించలేకపోయారు. అలాగే నిర్మాణం కూడా బాగానే ఉంది ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు బాగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: సుధీర్ – కృతి శెట్టి నటన, కథలో భావోద్వేగాలు, పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్స్: కొన్ని సన్నివేశాలు సాగదీతగా కనిపించాయి. కథనం ఊహకు తగ్గట్టు సాగుతున్నట్టు అనిపించింది.

రివ్యూ రేటింగ్‌: 2.5/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -