Venu Swamy: వేణుస్వామి చెప్పిన ప్రకారం నయనతార భర్తతో విడిపోనుందా?

Venu Swamy: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి.. ఆయన తట్టిలేపే వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఎవరో ఒక సెలబ్రేటి జాతకం గురించి ఉన్నది లేనిది అని చెప్పి బాగా హడావిడి చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆయన చెప్పిన జాతకం రాళ్లు తగిలితే నిజమని ఒకవేళ జరగకపోతే జనాలు అబద్ధం అని నమ్ముతూ ఉంటారు.

ఇక పలువురు సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కూడా వేణు స్వామి జాతకాలు చెబుతూ ఉంటాడు. గతంలో సమంత, నాగచైతన్యల పెళ్లి సమయంలో కూడా వాళ్లు విడాకులు తీసుకుంటారు అని చెప్పగా అది నిజం అవడంతో అందరూ ఆ సమయంలో ఆయన జోష్యం ను నమ్మారు. అయితే ఇదంతా పక్కన పెడితే నయనతార జాతకం గురించి చెప్పిన మాటలు కూడా నిజమవుతాయేమో అని అనుమానాలు వస్తున్నాయి.

 

గతంలో ఆయన నయనతార జాతకం గురించి కొన్ని కామెంట్లు చేశాడు. నయనతార పెళ్లి చేసుకుంటే కలతలు వస్తాయని అప్పట్లో అన్నాడు. అయితే నాయనతార తను ప్రేమించిన డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ఈ జంట చాలా అన్యోన్యంగా, సంతోషంగా కనిపించారు. పెళ్లయిన కొన్ని నెలలకే తల్లితండ్రులు అయ్యారు.

 

అయితే విగ్నేష్ శివన్ ఎప్పుడూ నయనతార ఫోటోలు పంచుకుంటూ ఉండేది. కానీ ఈ మధ్య అసలు పంచుకోవడం లేదు. కనీసం నయనతార ఏ సినిమాలకు కూడా సైన్ చేయడం లేదని తెలిసింది. అయితే వీరిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుండి గొడవలు జరుగుతున్నాయని.. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగాయని తెలుస్తుంది. దీంతో వీరిద్దరూ నిజంగానే విడిపోతారేమో అని జనాలు అనుమానం పడుతున్నారు. వేణు స్వామి చెప్పిన మాటలు నిజం అవుతాయేమో అని అనుకుంటున్నారు. మరి నయనతార దంపతులు నిజంగానే విడిపోతారా.. వేణు స్వామి చెప్పిన మాటలు నిజమవుతాయా అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -