Prabhas: ప్రభాస్ సంస్థ లెక్కల్లో తేడా.. నిజాలు బయటికొస్తాయా?

Prabhas: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇప్పుడు ఒక హాట్ న్యూస్ షేక్ చేస్తుంది. అదే.. టాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో అగ్రగామి అయినటువంటి యూవీ క్రియేషన్స్‌ పై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించడం. హైదరాబాద్ లో.. కావూరి హిల్స్ నందు గల ఆ సంస్థ ఆఫీసులో జీఎస్టీ నిఘా విభాగానికి చెందిన అధికారులు తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

 

యూవీ క్రియేషన్స్‌ సంస్థ సుమారు రూ.6 కోట్లకు పైగా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు.. విచారణ కోసం సంస్థకు సంబంధించిన కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసున్నారని తెలుస్తోంది. ఇక సంస్థ ఆదాయం వారు చెల్లిస్తున్న జీఎస్టీ లెక్కల్లో తేడాలు ఉండడంతో అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం.

 

 

ఇక ఈ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ను హీరో ప్రభాస్ సోదరుడు.. ఉప్పలపాటి ప్రమోద్ తాను మరియు తన స్నేహితులు వంశీ, విక్రమ్ లు భాగస్వాములుగా 2013 సంవత్సరంలో స్థాపించారు. మొదటి సినిమా “మిర్చి” సూపర్ హిట్ అవ్వడంతో.. మంచి లాభాలు పొందింది. తర్వాత శర్వానంద్‌తో “రన్ రాజా రన్”, గోపీచంద్‌తో “జిల్” తో పాటు.. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, సాహో, రాధే శ్యామ్ మొదలైన సినిమాలు రూపొందించారు. ప్రభాస్ నాయకుడిగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈ యూవీ క్రియేషన్స్ విడుదల చేస్తుంది.

 

 

ఇదిలా ఉండగా తెలుగు నిర్మాణ సంస్థపై అధికారుల దాడి టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అయితే సంస్థ ఆర్ధిక లావాదేవీల్లో జరిగిన అవకతవకలే సోదాలు నిర్వహించడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీనితో మిగతా సంస్థలు కొంత మేరకు ఆందోళన చెందుతూ.. అప్రమత్తం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -