Acharya: చిరంజీవి పరువు తీసిన ఆచార్య.. రేటింగ్ ఇంత ఘోరమా?

Acharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్, హీరోయిన్ పూజా హెగ్డే కూడా నటించారు. ఎంతో బిజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఈ సినిమా అలరించలేకపోయింది. కలెక్షన్లు రాబట్టే విషయంలోనూ ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా ఒప్పుకున్నారు. అయితే ఆచార్య సినిమాపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా సోషల్ మీడియాకు వచ్చారు. ఆచార్య సినిమాను పొగడటం మొదలు పెట్టారు. మెగాస్టార్ సినిమా కొత్త రికార్డు సృష్టించిందని పోస్టులు పెడుతున్నారు.

 

 

ఇటీవల చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా టీవీల్లో ప్రసారమైంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాకు 6.30 టీఆర్‌పీ వచ్చింది. అయితే ఇది చాలా పెద్ద నంబర్ అని, మంచి టీఆర్‌పీని సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్ల వద్ద బోల్తా కొట్టి.. బయ్యర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ నష్టాన్ని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భర్తీ చేశామని కూడా గతంలో ప్రకటించారు. అయితే డిజాస్టర్ మూవీగా నమోదైన ఈ సినిమా.. బుల్లితెరపై మాత్రం హిట్ అయిందని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

 

 

నిజానికి ఆచార్య సినిమాకు వచ్చిన టీఆర్‌పీ రేటింగ్ ఏమాత్రం చెప్పుకోదగినది కాదు. ఇటీవల టీవీల్లో ప్రసారమైన బంగార్రాజు (14), అఖండ (13.3), ఎఫ్-3 (8.2) సినిమాలు అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నాయి. వాటితో పోల్చుకుంటే ఆచార్య సినిమా కేవలం 6.3 టీఆర్‌పీని మాత్రమే నమోదు చేసుకుంది. అయితే చిరంజీవి నటించిన మరో చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’తో పోల్చుకుంటే ఆచార్య సినిమాకు మంచి టీఆర్‌పీ వచ్చిందట. అందుకే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టారని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. దీంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -