Actor Chandra Mohan: చంద్రమోహన్ కూతురు కూడా ఇండస్ట్రీలో గొప్ప హీరోయిన్.. ఆమె ఎవరంటే!

Actor Chandra Mohan: తెలుగు సినీ ప్రియులకు అప్పటి గొప్ప నటుడు చంద్రమోహన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చంద్రమోహన్ లో ప్రత్యేకత ఏమిటంటే తండ్రి పాత్రలు చేయడంలో తనకు సాటి ఎవరూ రారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట మహానటి శ్రీదేవి కూడా చంద్రమోహన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

అంతెందుకు మొన్నటి వరకు చంద్రమోహన్ డేట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు ఎదురుచూశారు. ఇలా ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల చంద్రమోహన్ పూర్తిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైపోయాడు. ఇదంతా పక్కన పెడితే చంద్రమోహన్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

చంద్రమోహన్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక సినిమాలో నటించి పెద్ద స్టార్ అయింది. ఆమె చంద్రమోహన్ సొంత తమ్ముడు కూతురట. దర్శకుడు కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సప్తపది సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆమె పేరు సబిత. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఎంతలా అంటే ఈ సినిమా తర్వాత సబితకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ సబిత వాటిని చేయనని తిరస్కరించింది.

ఆ తర్వాత వివాహం చేసుకొని సబిత ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుందట. సబిత ఒక ఈవెంట్లో డాన్స్ చేస్తూ ఉండగా కె.విశ్వనాథ్ ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ క్రమంలో సబిత నాట్యం చూసిన కె విశ్వనాథ్. తన సినిమాలో హీరోయిన్ గా నటించమని సభితను అడిగాడట. మొదట సబితా నటించడానికి ఒప్పుకోలేదట. ఇక చంద్రమోహన్ చెప్పడంతో ఆ సినిమాలో నటించిందట. ఏదేమైనా చంద్రమోహన్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -