Naga Babu: ఆయన ఇప్పుడు మీకు హీరో నాకు చిన్నప్పటి నుంచి హీరోనే?

Naga Babu: మెగాస్టార్ నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో ఘనంగా మెగా కార్నివాల్ నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.ఈ మెగా కార్నివాల్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మెగా అభిమానులతో పాటు మెగా హీరోలు కూడా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ తనకు తన అన్నయ్యతో 62 సంవత్సరాల అనుబంధం ఉందని, ఆయన ఓ నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి స్థానంలో నిలబెట్టారు. ఆయన ఎల్లప్పుడూ మెగా కుటుంబం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారని తెలిపారు.ఇక తమ్ముడిని డైరెక్టర్ చేద్దామంటే నీలో చాలా స్పార్క్ ఉంది ముందు హీరో అవ్వు అంటూ తమ్ముడిని ఇలా మీ ముందు పవర్ స్టార్ గా నిలబెట్టారని నాగబాబు తెలిపారు.

ఇకపోతే మెగాస్టార్ బన్నీ, చరణ్, వరుణ్, సాయి ధరమ్, వైష్ణవి, శిరీష్ నిహారిక అందరికీ బంగారు భవిష్యత్తును కల్పించారని ఈ సందర్భంగా మెగా బ్రదర్ చిరంజీవి గొప్పతనం గురించి వెల్లడించారు. ఇక తనకు చిన్నప్పటినుంచి అన్నయ్య పుట్టినరోజు వేడుకలు అంటే ఎంతో ప్రత్యేకంగా ఉండేదని నాగబాబు పేర్కొన్నారు. ఆయన ఇప్పుడు మీకు హీరో కావచ్చు కానీ నాకు చిన్నప్పటినుంచి తానే నా హీరో ఆయనని చూస్తూనే పెరిగామంటూ ఈ సందర్భంగా నాగబాబు వెల్లడించారు.

ఇలా ఎంతోమందికి ఎంతో స్ఫూర్తిగా నిలిచినటువంటి ఈయన మనస్సు కూడా చాలా మంచిది. అయినా కొందరు అన్నయ్య పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటారు. ఇలా అన్నయ్య పై కానీ లేదా తమ్ముడు పై కానీ ఎవరైనా ఏమైనా విమర్శలు చేసిన తాటతీస్తా ఇందులో డౌటే లేదు అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా మెగా ఫ్యామిలీ గురించి ఎవరేం మాట్లాడిన తాను తప్పకుండా ఆ వాక్యాలను తిప్పికొడతానని అందుకే నన్ను చాలామంది కాంట్రవర్షియల్ పర్సన్ అంటారని నాగబాబు ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -