Actor Naga Mahesh: భరత్ అనే నేను సినిమాలో నా పవర్ ఫుల్ డైలాగ్ తీసేసారు: నటుడు నాగ మహేష్

Actor Naga Mahesh: తెలుగు ప్రేక్షకులకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమా ఒక విద్యార్థి గురించి. అతని పేరు భరత్. అనుకోకుండా అతడు ఆంధ్రప్రదేశ్ నాయకుడు అవుతాడు. అతడు రాజకీయాలను తిరగరాసే ప్రయత్నం చేస్తాడు. మొత్తంగా ఈ సినిమా పొలిటికల్ యాక్సన్ మిక్స్ అయిన సినిమా.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు నిర్మాతగా డి వి వి దానయ్య వహించాడు. ఇక ప్రకాష్ రాజ్ , శరత్ కుమార్, దేవరాజ్, పోసాని కృష్ణ మురళి , బ్రహ్మాజీ పలువురు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాను 2018 ఏప్రిల్ 28న విడుదల చేశారు. దాదాపు 65 కోట్ల నిర్మాణంతో ఈ సినిమాను ప్రేక్షకులను ముందుకు తీసుకుని వచ్చారు.

మరి ఇదంతా పక్కన పెడితే యాక్టర్ నాగ మహేష్ గురించి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో పలు పాత్రలు చేసి నటుడిగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేస్తూ నాగ మహేష్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ మహేష్ తను ఒక విషయంలో అదిరిపోయాను అని తెలిపాడు.

భరత్ అనే నేను సినిమాలో నేను ఓ సీన్ లో పొలిటికల్ గా ఒక డైలాగ్ చెబుతాను. డైలాగ్ విషయంలో పూర్తిగా పాత్రలో మునిగిపోయి చెప్పాను. ఆ డైలాగ్ చాలా బాగుందని అక్కడ వారు కూడా నాకు తెలిపారు అని నాగ మహేష్ తెలిపాడు. కానీ భరత్ అనే నేను సినిమాలో నా డైలాగును డిలీట్ చేశారని దాన్ని నేను తీసుకోలేకపోయాను అని నాగ మహేష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -