Nandamuri Balakrishna: బాలయ్య బాబు అందుకే కొడతారట!

Nandamuri Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరోలలో నందమూరి బాలయ్య బాబుకు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బాలయ్య బాబు ఎక్కడికైనా వస్తున్నారని తెలిస్తే.. అభిమానులు అక్కడికి భారీగా చేరుకుంటారు. చాలాసార్లు బాలయ్య తన అభిమానుల మీద చేయి చేసుకోవడం గురించి తరుచూ వార్తలో చూస్తూనే ఉంటాం. అయితే బాలయ్య బాబు అలా చేయి చేసుకోవడంపై టాలీవుడ్ నటుడు పింగ్ పాంగ్ సూర్య ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

ప్రస్తుతం ఆడియన్స్ కంటెంట్ సరిగా వుంటేనే థియేటర్స్ కు వస్తున్నారని పింగ్ పాంగ్ సూర్య చెప్పాడు. తెలుగు సినిమాలో కంటెంట్ చాలా వరకు పెరిగిందని అన్నాడు. అలాగే నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన బీజీఎం సూపర్ గా ఉందని, తనకు బాగా నచ్చిందని అన్నాడు.

అలాగే నందమూరి బాలకృష్ణ గారితో షూటింగ్ భలేగా ఉంటుందని అన్నాడు. బాలయ్య బాబుతో డిక్టేటర్ వంటి సినిమాలలో చేశానని, వాస్తవానికి బాలకృష్ణ గారి మనస్సు చాలామంచిది అని సూర్య చెప్పుకొచ్చాడు. ఆయన మనస్సు కల్మశం లేకుండా ఉంటుందని అన్నారు. ఓపెన్ గా మంచి, చెడు గురించి చెబుతారని , ఆయన అందరికి ఒకే రకమైన గౌరవం ఇస్తారని చెప్పాడు. బాలయ్య కు కోపం వస్తుందని, కారణం లేకుండా ఆయన ఎవరిపై కోపం తెచ్చుకోరని సూర్య వివరించాడు. బాలయ్య ఫ్యాన్స్ తో కూడా చాలా ప్రేమ తో వుంటారని చెప్పుకొచ్చాడు. ఎవరినైనా కొట్టినా మళ్లీ పిలిచి సెల్ఫీ దిగుతారని చెప్పాడు.

బాలయ్య కోసం వచ్చే ఫ్యాన్స్ చాలాసార్లు అతిగా ప్రవర్తిస్తుంటారని, వారిని కంట్రోల్ చేయడానికే బాలయ్య ఫ్యాన్స్ మీద చేయి చేసుకుంటారని సూర్య వివరించాడు. ఒకరిని కొడితే అందరూ సెట్ అవుతారనే ఉద్దేశంతో బాలయ్య అలా చేస్తుంటారని సూర్య చెప్పుకొచ్చాడు. మరో పక్క నటుడు సత్యదేవ్ తో తనకు మంచి రిలేషన్ ఉందని, ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేసినట్లు వివరించిన సూర్య.. బ్లఫ్ మాస్టర్ సినిమాలో తన సీన్లు కట్ చేయడం బాధ కలిగించిందని అన్నాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -