Anchor: యాంకర్ పై నోరు పారేసుకున్న హీరో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్!

Anchor: ప్రముఖ మలయాళ నటుడు స్టార్ హీరో శ్రీనాథ్ బాసీనీను కేరళ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మలయాళ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన ఒక మహిళ యాంకర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే యాంకర్ పై అసభ్య పదజాలంతో తనని దూషించడం వల్ల యాంకర్ హీరో పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే యాంకర్ చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు నటుడు శ్రీనాథ్ ను అరెస్టు చేశారు.ఈ క్రమంలోనే అరెస్టు అయిన కొన్ని గంటల వ్యవధిలోని శ్రీనాథ్ బెయిల్ పై బయటికి వచ్చారు. అసలు శ్రీనాథ్ ను పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

హీరో శ్రీనాథ్ తాజాగా నటించిన చిత్రం చట్టంబి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి హాజరైనటువంటి శ్రీనాథ్ ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ తనని ఓ ప్రశ్న అడగడంతో హీరో తనపై పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.

ఈ విధంగా శ్రీనాథ్ అసభ్య పదజాలం ఉపయోగించడంతో యాంకర్ సోమవారం పోలీసులను ఆశ్రయించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె ఫిర్యాదు చేయడమే కాకుండా తన మాట్లాడిన మాటలకు సంబంధించిన రికార్డును కూడా పోలీసులకు అందజేయడంతో పోలీసులు నటుడు శ్రీనాథ్ పై 354, 509, 294 బీసెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని ఆయనని ఆదీనంలోకి తీసుకున్నారు. అయితే అరెస్టు అయిన కొన్ని గంటలకి ఈయన బెయిల్ పై బయటకు వచ్చారు.యాంకర్ తనని అగౌరవ పరుస్తూ ప్రశ్నలు అడగడంతో ఆ సమయంలో సహనం కోల్పోయి అలా మాట్లాడానని ఈయన చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -