RGV: టాలీవుడ్ ప్రేక్షకులకు రామ్ గోపాల్ వర్మ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హర్రర్ నేపథ్యంలో కలిగిన చిత్రాలకు ప్రాణం పోయడంలో వర్మ దర్శకుడుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు వివాదాలను తట్టి లేపి వివాదాస్పద డైరెక్టర్ గా కూడా పిలవబడుతున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటాడు.
తనకు కుదిరినప్పుడల్లా ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ చేసి నెటిజన్ల ను ఆలోచించే విధంగా చేస్తాడు. ఇదిలా ఉంటే ఇటీవలె రామ్ గోపాల్ వర్మ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. గొప్ప చిత్రాలను అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత ఆయన కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని స్వార్థ సినిమా పరిశ్రమ కి నా జోహార్లు అంటూ సిగ్గుగా ఉంది అని రామ్ గోపాల్ వర్మ దెప్పి పొడిచినట్లుగా ఒక ట్వీట్ చేసాడు.
దీని అర్థం ఏమిటంటే కృష్ణంరాజు మరణం విషయం తెలిసి షూటింగ్ లు ఆపుకోకుండా సినిమా షూటింగ్ వ్యవహారాలను కొనసాగించిన వారిపై రామ్ గోపాల్ వర్మ ఒక్క సారిగా మండి పడ్డాడు. మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబుకి, బాలయ్యకి, మహేష్ బాబుకి, ప్రభాస్ కి నేను తెలియజేసేది ఏమిటంటే రేపు మీలో అందరికీ ఇదే దుస్థితి ఏర్పడుతుంది. ఇక ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు తెలుపక పోతే మన మీద మనకే ఉమ్మేసినట్లుగా అనిపిస్తుంది. అని రామ్ పాల్ వర్మ ట్వీట్ చేసాడు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కి యాక్టర్ శివ పార్వతి ఏకీభవించింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ పార్వతి ఒక గొప్ప లెజెండ్ చనిపోయినప్పుడు మనం అతని కోసం ఒక రోజు షూటింగ్ ఆపుకోలేకపోవడం చాలా బాధపడాల్సిన విషయం అని తెలిపింది. కనుక ఈ విషయంలో నేను రామ్ పాల్ వర్మ తో ఏకీభవిస్తాను అని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.