Actors: ఇండస్ట్రీలో ఈ స్టార్లు చనిపోయిన తర్వాత విడుదలైన వారి సినిమాలు ఇవే!

Actors:  సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటే ఎంతోమంది అభిమానులు ఉంటారు. అంతటి అభిమానులను సంపాదించుకున్న స్టార్లు కొందరు హఠాత్తుగా మరణించారు. అలా మరణించినప్పటికీ వారు చివరి గా నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో విడుదలైన ఆ స్టార్ల సినిమాలు గురించి తెలుసుకుందాం.

సుశాంత్ సింగ్ రాజపుత్: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. 2020 జూన్ 14న సుశాంత్ మరణించాడు. ఆయన చనిపోయిన 40 రోజుల తర్వాత ఇతడి చివరి సినిమా దిల్ బెచార విడుదలైంది. ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

ఏఎన్ఆర్: అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాంటి ఆయన చివరి సినిమా మనం. ఈ సినిమా ఆయన చనిపోయిన ఐదు నెలల తర్వాత విడుదలైంది.

శ్రీహరి: రియల్ స్టార్ శ్రీహరి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తెలుగు నాట నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నప్పుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు శ్రీహరి. 2013 అక్టోబర్ 9న శ్రీహరి చనిపోయాడు. ఆయన మరణం అనంతరం చివరి చిత్రం రాంబో రాజ్ కుమార్ అనే బాలీవుడ్ చిత్రం విడుదలైంది.

సౌందర్య: అప్పటి అందాల తార సౌందర్య గురించి పెద్దగా పరిచయంకర్లేదు. 2004 ఏప్రిల్ 17న సౌందర్య హెలికాప్టర్ ప్రయాణంలో హఠాత్ మరణం చెందింది. సౌందర్య చనిపోయిన తర్వాత ఆప్తమిత్ర, మోహన్ బాబు శివశంకర్ సినిమాలు విడుదలయ్యాయి.

ఆర్తి అగర్వాల్: తెలుగు ప్రేక్షకులకు అప్పటి అందాల తార ఆర్తి అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2015 లో ఈమె చనిపోయింది. ఆమె మరణించిన తర్వాత.. ఆమె నటించిన చివరి సినిమా ఆమె ఎవరు అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాను చూసిన ఆర్తి అగర్వాల్ అభిమానులు అప్పట్లో బాగా నిరాశ చెందారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -