Ananya Nagalla: అనన్య నాగళ్ల ఆ ఇంటికి కోడలు కానుందా.. కాబోయే భర్త ఎవరంటే?

Ananya Nagalla: అనన్య నాగళ్ల ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోయినా.. సోషల్ మీడియాలో తన అందంతో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత ప్లే బ్యాక్ సినిమాలో నటించి నటిగా తెలుగు నాట ఓ గుర్తింపు సంపాదించుకుంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో అనన్య ఒక కీలక పాత్ర పోషించి తన నటనకు గాను ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తో అనన్య కు ప్రేక్షకులతో మరింత ర్యాపో పెరిగిపోయింది. అప్పటినుంచి ఈ అమ్మడు ఎలాగైనా ఒక మంచి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయాలని ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే అనన్య.. తన హాట్ ఫోటోల తో కుర్ర కారుని పిచ్చెక్కిస్తుంది.

తన అందంతో అడపాదడపా కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. మరి క్రేజ్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న అనన్య వకీల్ సాబ్ సినిమా తర్వాత మరే సినిమాలో కనిపించలేదు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ అమ్మడు గురించి ఒక వార్త టాప్ అప్ ద ఇండస్ట్రీగా మారింది. అనన్య నాగళ్ల ఒక పెద్దింటి కోడలు అవ్వబోతుందని సమాచారం. తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న ఒక పెద్దాయన చిన్న కొడుకుతో అనన్య కు వివాహం జరగబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే మొదట వీరిద్దరూ ప్రేమించుకొని, ఆ తర్వాత తమ ప్రేమను పెద్దలకి చెప్పి ఒప్పించుకున్నారట. ప్రస్తుతం అనన్య కు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో జన్మించింది. ఇక తల్లి తల్లిదండ్రుల విషయానికొస్తే తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి విష్ణు ప్రియ.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -