Actress: ఇండస్ట్రీలో వరుస విషాదాలు.. బుల్లితెర నటి మృతి!

Actress: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి అస్సలు కలిసిరానట్లు అనిపిస్తోంది. వరుసగా సినీ ప్రముఖులు కన్నులు మూస్తున్నారు. దాంతో అటు కుటుంబసభ్యులు, ఇటు ఫ్యాన్స్ కుంగిపోతున్నారు. ఈ రోజు తెలుగు దర్శకుడు మదన్ గుండెపోటుతో స్వర్గీయులయ్యారు. ఆ విషయాన్ని మరువకముందే ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ మరణించారు. అయితే ఆమె వయసు కేవలం 24 ఏళ్లే. గుండెపోటు సమస్యతో బాధపడుతున్న ఐంద్రీలా.. ఇటీవల కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

 

 

బెంగాలీ ఇండస్ట్రీలో బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చారు ఐంద్రీలా శర్మ. సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఐంద్రీలా శర్మ పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో పుట్టింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆమెకున్న మక్కువతో బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టింది. ‘జిబన్ జ్యోతి, మహాపీఠ్ తాతా పీఠ్’ తదితర సీరియల్స్ లో నటించారు. ‘ఆమీ దీతీ నంబర్.1, లవ్ కేఫ్’ లాంటి చిత్రాల్లో నటించి ఐంద్రీలా శర్మ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 

 

అయితే గతకొంత కాలంగా ఐంద్రీలా శర్మ అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. నవంబర్ 1వ తేదీన ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు జాయిన్ చేయించారు. అయితే గతంలోనూ తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఐంద్రీలా శర్మకు మేజర్ ఆపరేషన్ కూడా జరిగిందని కుటుంబసభ్యులు తెలియజేశారు. చికిత్స చేయించుకుంటున్న సమయంలోనే ఐంద్రీలా శర్మకు హార్ట్ అటాక్ కూడా వచ్చిందని, అప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే మృతి చెందడంపై బెంగాలీ సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఎంతో మంచి భవిష్యత్‌ను కోల్పోయిందని పలువురు తమ అభిప్రాయాన్ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త విన్న ప్రముఖులు, సెలబ్రిటీలు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -