Actress Ileana : ఇలియానాని ఆ మాటతో బాధపెట్టిన ఫస్ట్ క్రష్!

Actress Ileana : ఇలియానా.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దేవదాసు సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ.

అనంతరం పలు స్టార్ హీరోల సరసన నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇక కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ కి స్కిప్ అయింది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ కి వెళ్లినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో దక్కినంత ఆదరణ దక్కించుకోలేకపోయింది.

కాగా అటు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇటు తెలుగు ఇండస్ట్రీకి కాకుండా పోయింది అమ్మడు. ఇక అప్పటినుంచి మరి ఏ సినిమాలో కూడా ఇలియానా కనిపించలేదు. ఇక సినిమాలకు గత కొంతకాలం నుంచి పూర్తిగా దూరంగా ఉంటున్న ఇలియానా ఏదో ఒక వెకేషన్ పేరుతో ఫుల్ గా చిల్ అవుతుంది. అంతేకాకుండా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

అంతేకాకుండా తన హాట్ ఫోటోలను నెట్టింట్లో పంచుకొని కుర్ర కారుని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది ఈ ముద్దు గుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా ఇలియానా తన ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టింది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇలియానా ఈ విషయాన్ని వెల్లడించింది. తన జీవితంలో జరిగిన తొలి అనుభవాల గురించి వివరించింది.

ఇక ఇలియానా తన పక్కింటి అబ్బాయిని ప్రేమించిందట. అంతేకాకుండా తనపై చాలా ఇష్టాన్ని పెంచుకుందట. కానీ ఆ కుర్రాడు మాత్రం ఇలియానాకు గుండె పగిలిపోయేంత షాక్ ఇచ్చాడట. అదేమిటంటే ఇలియానా ప్రేమ తనకు నచ్చలేదని తను రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని ఇలియానా వెల్లడించింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -