Karate Kalyani: నటి కరాటే కళ్యాణి కామెంట్లు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Karate Kalyani: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెండితెరపై పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అలా దాదాపుగా 120 కి పైగా సినిమాలలో నటించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో కరాటే కళ్యాణి ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా హైలెట్ అవుతోంది. కాగా కరాటే కళ్యాణి ఎక్కువగా సినిమాలలో ఆమె వ్యాంప్ పాత్రల్లోనే నటించింది.

చేసిన పాత్రలతోనే ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. కానీ ఆమె స్థాయికి తగ్గ పాత్రలు మాత్రం రాలేదనే చెప్పవచ్చు. ఇక సినిమాలతోనే కాకుండా ఆమె రాజకీయాల్లో కూడా బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలా ఉంటే తాజాగా కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తాజాగా కరాటే కల్యాణి మాట్లాడుతూ.. నేను సినిమాల్లో చేసిన వ్యాంప్ పాత్రలతోనే నాకు పేరొచ్చింది. అలాంటివి చేయడం వల్ల తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నాను. కానీ వాటితోనే కదా నాకు పేరు వచ్చింది. నేను సినిమాల్లో పైట జారిస్తే సొల్లు కార్చేవారు చాలామందే ఉన్నారు.

 

కానీ చివరకు వారే నన్ను తిడుతారు. కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని తెలిపింది కరాటే కళ్యాణి. అయితే ఇప్పటికీ నాకు సినిమాలు తప్ప ఇంకేం బిజినెస్ లు లేవు. సినిమాలు చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. కానీ ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావట్లేదు అంటూ తెలిపింది కరాటే కల్యాణి. కాగా కళ్యాణి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కళ్యాణి బిగ్ బాస్ ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -