Kushboo Sundar: ఆ సినిమా సమయంలో ఖుష్బూ కి అలాంటి అనుభవం… ఏమైందంటే?

Kushboo Sundar: అందాల తార ఖుష్బూ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితో కలిసి నటించింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ తాను చాలా సినిమాల్లో నటించింది. నిజం చెప్పాలంటే తన నటనకు అందానికి కుష్బూ అభిమానులంతా తన భక్తులై గుడి కూడా కట్టేశారు అన్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఖుష్బూ ఆ తర్వాత కొన్నాళ్ళకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు ఇప్పుడు పలు షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఇప్పటికి అలరిస్తూనే ఉంది.

అయితే ఎంతటి గొప్ప పేరు పొందిన వారికైనా వాళ్ళ జీవితంలో కొన్ని చేదు సంఘటనలు తప్పని సరిగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనే పదం వినపడడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఈ విషయం పై స్పందించడానికి భయపడేవారు. ఇప్పడు సామాజిక మాధ్యామాలు రావడంతో ఏ విషయాన్నైనా నిర్భయంగా పంచుకుంటున్నారు. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ పై ఖుష్బూ కూడా స్పందించింది.

నిజంగా సినిమా మీద ఆలోచన ఉన్న నిర్మాతలెవరూ కూడా ఒక్క రాత్రి కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టరు అని తేల్చి చెప్పేసింది. నిజానికి అన్ని రంగాల్లోనూ ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని కానీ ఈ సినిమా పరిశ్రమ అంటేనే తెరిచిన పుస్తకం కాబట్టి ఇండస్ట్రీ కి సంబందించిన వార్తలే ఎక్కువగా బయటికి వస్తాయని చెప్పుకొచ్చింది. అయితే ఇన్నేళ్ల నా కెరీర్ లో ఇలాంటి వేధింపులు ఎదురు కాలేదని తాను చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. కలియుగ పాండవులు షూటింగ్ సమయంలో హాస్టల్ మెట్లు ఎక్కుతుండగా ఒకరు అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడికక్కడే వాడి రెండు చెంపలు పగలగొట్టి వాడికి బుద్ది చెప్పానని తన జీవితంలో జరిగిన చేదు నిజాన్ని బయట పెట్టింది. అయితే నాకు ఈ సమయంలో హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు మరియు టెక్నీషియన్స్ అంతా నాకు అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chintamaneni Prabhakar Vs Abbaya Chowdary: లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్.. దెందులూరు నియోజకవర్గంలో గెలుపు అతనిదేనా?

Chintamaneni Prabhakar Vs Abbaya Chowdary: దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ చౌదరి తనదైన శైలిలో రాజకీయం చేయటంలో తన ప్రత్యేకత కనబరిచారు అయితే రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి...
- Advertisement -
- Advertisement -