Meena: ఆ హీరోయిన్ తల్లి వల్ల కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ పోయిందట?

Meena: తెలుగుతో పాటు తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి, టాప్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ మంచి సినిమాలతో అలరిస్తున్న హీరోయిన్ మీనా. తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మీనాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సినీ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. పాపం మీనాకు అలా జరిగిందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

తెలుగుతో పాటు తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న మీనాకు మంచి మంచి సినిమాల నుండి అవకాశాలు వచ్చేవట. అయితే మీనాకు వచ్చే ఏ కథ అయినా మీనా తల్లి ఫైనల్ చేసేదట. ఆమెకు నచ్చితేనే సినిమాకు ఓకే చెప్పేదట. కొన్నిసార్లు మీనాకు నచ్చి, ఆమె తల్లికి నచ్చకపోతే ఆ సినిమా చేయడానికి ఒప్పుకునేది కాదట.

తెలుగుతో పాటు తమిళంలో భారీ హిట్ అయిన సినిమా రజినీకాంత్ చేసిన ‘నరసింహ’. ఆ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పొగరుబోతు అమ్మాయిగా నీలాంబరి క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ ను రమ్యకృష్ణ చేయగా.. ఆమెకు భారీ సూపర్ హిట్ అవడం తెలిసిందే.

నిజానికి నీలాంబరి క్యారెక్టర్ కోసం ముందుగా నగ్మాని అనుకున్నారట. కానీ ఆమెకు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆ అవకాశాన్ని మిస్ అయిందట. తర్వాత ఆ క్యారెక్టర్ చేసే అవకాశం మీనాకు వచ్చిందట. కానీ మీనా తల్లికి ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో ఆ సినిమాను వద్దని చెప్పిందట. ఆ తర్వాత రమ్యకృష్ణకు వెళ్లగా.. ఆమె చేసి అదరగొట్టేసింది. కాగా మీనా కెరీర్ లో బెస్ట్ సినిమాను తన తల్లి కారణంగా కోల్పోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -