Actress Poorna: నటి పూర్ణకు భర్త ఇచ్చిన బహుమతులు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Actress Poorna: హీరోయిన్, నటి పూర్ణ దీపావళి సందర్భంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ముందస్తు సమాచారం లేకుండానే, చడీచప్పుడు కాకుండా కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో ఆమె వివాహ వేడుక జరుపుకున్నారు. ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు ఈ ఫొటోలను చూసి లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

అల్లరి నరేశ్ హీరోగా నటించిన సీమ టపాకాయ్ చిత్రంతో పూర్ణ హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును, అవును2 లాంటి సినిమాల్లో నటించారు పూర్ణ. ఆ చిత్రాల్లో కాస్త హాట్ సీన్లతో పాపులర్ అయ్యారు పూర్ణ. దీపావళి పర్వదినం సందర్భంగా పెళ్లి చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పెళ్లి ఫొటోలు పంచుకున్నారు.

ఎన్ని కానుకలు ఇచ్చారు.. ఎంత బంగారం పెట్టారు?

అయితే, ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భర్త ఎంత బంగారం పెట్టాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది కొత్త చర్చకు దారి తీస్తోంది. ఫొటోల్లో ఒంటినిండా బంగారం నగలతో ధగధగ మెరిసిపోతూ కనిపిస్తోంది పూర్ణ. ఎంత బంగారం పెట్టాడు, ఏమేం కానుకలు ఇచ్చాడంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

పూర్ణకు పెళ్లి సందర్భంగా సుమారు 1700 గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇచ్చారట. దాంతో పాటు పూర్ణ కోసం ఓ లగ్జరీ హౌస్ ను ఆమె పేరు మీద గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ జెబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ను పూర్ణ పెళ్లాడారు. దీంతో పూర్ణకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాది మేలో వీరిద్దరికీ నిశ్చితార్థ వేడుక జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -