Rakul Preet: అలాంటి కొడుకు పుడితే రకుల్ చేసే పని తెలిస్తే షాకవ్వాల్సిందే?

Rakul Preet: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కెరటం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని అతి తక్కువ సమయంలోనే అగ్రతారగ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రకుల్ ప్రీతిసింగ్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా వరుస అవకాశాలను అందుకున్నారు.

ఇలా సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగులో కొండ పొలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఈ సినిమా తీవ్ర నిరాశపరచడంతో ఎలాంటి తెలుగు సినిమాలను ప్రకటించలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం నెల వ్యవధిలోని ఏకంగా నాలుగు సినిమాలను విడుదల చేస్తోంది.

ఇకపోతే తాజాగా ఈమె నటించిన డాక్టర్ జీ అనే సినిమా కూడా విడుదలైంది. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ ప్రీత్ కి చెందిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ ఈ వీడియోలో రకుల్ ప్రీతిసింగ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.రకుల్ 2011లో మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ వేదికపై రకుల్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తూ ఒకవేళ నీకు పుట్టిన కుమారుడు గే అని తెలిస్తే మీరు ఎలా ఫీలవుతారు అనే ప్రశ్న వేశారు.తన కుమారుడు గే అని తెలియగానే ముందుగా తాను షాక్ అవుతానని ఆ తర్వాత తన చెంపపై లాగి ఒకటి కొట్టిన తర్వాత అసలు ఎందుకు తను అలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆలోచిస్తాను అంటూ సమాధానం చెప్పారు.అయితే తన నిర్ణయాన్ని గౌరవించి తనకు నచ్చిన విధంగానే తనను బ్రతకనివ్వడానికి స్వేచ్ఛ కల్పిస్తానంటూ ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ పాత వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -