Actress Sreeleela Mother: వివాదంలో చిక్కుకున్న నటి శ్రీ లీలా తల్లి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు?

Actress Sreeleela Mother: ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో అగ్ర హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి శ్రీలలా. రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీ లీలా తన మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మదిని దోచుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయని చెప్పాలి. ఇలా వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీ లీల తల్లి ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఈమె తల్లి స్వర్ణలత తన కూతురు వెంటే ఉంటూ పలు షూటింగ్లకు హాజరవుతూ ఉంటారు. అయితే ఈమె తన భర్త శుభకర్ రావ్ నుంచి సుమారు 20 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. ఇంకా వీరి విడాకులకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ ఉంది.

ఈ క్రమంలోనే శ్రీ లీలా తండ్రి శుభకర్ రావు తన తల్లి స్వర్ణలతపై కర్ణాటకలోని అడుగుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈయన పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే స్వర్ణలత అక్టోబర్ మూడవ తేదీ బెంగళూరులో కోరమంగళలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోకి ఎటువంటి పర్మిషన్ వచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా తన అనుమతి లేకుండా తన అపార్ట్మెంట్లోకి రావడమే కాకుండా అపార్ట్మెంట్ తాళాలు బద్దలు కొట్టి ఈమె ఇంట్లోకి వచ్చారని శుభకర్ రావు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

ఈ విధంగా స్వర్ణలతా అక్రమంగా తన ఇంట్లోకి రావడంతోనే ఈయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై శ్రీ లీల తల్లి స్వర్ణలత ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఇకపోతే గతంలో శుభకర్ రావు తనకు పుట్టిన బిడ్డ కాదంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఈ విషయం కూడా పలు చర్చలకు కారణమైంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -