Varsha Bollamma: కోటీశ్వరుడిని పెళ్లి చేసుకున్న వర్ష.. భలే స్కెచ్ వేసిందిగా?

Varsha Bollamma:  ఫాంలో ఉన్నట్లుగానే రికార్డులు బద్దలు కొట్టాలన్నట్లుగా.. నేటి యువతరం నటీనటులు వ్యవహరిస్తున్నారు. ఒకటి రెండు చిత్రాల్లో హిట్ కొట్టాక కెరీర్ సెటిల్ అయ్యేలా చూసుకుంటున్నారు. కొందరు హీరోయిన్లయితే బాగా డబ్బున్న వారి ఇంటికి కోడళ్లుగా వెళ్లడానికి డిసైడ్ చేసుకుంటున్నారు. అయితే, ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన సంస్కృతి కాదు.. అనాదిగా సినిమా ఇండస్ట్రీలో వస్తున్నదే. గతంలోనూ కొన్ని హిట్ చిత్రాల్లో నటించిన తర్వాత పెద్ద స్టార్లను పెళ్లి చేసుకొని సెటిల్ అయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇదే కథ నడుస్తోంది. కొందరు తమతో కలిసి నటించిన హీరోను పెళ్లాడితే, మరికొందరు తమ కెరీర్ ముగించే సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. కొందరు సినిమా దర్శకులను కూడా మనువాడారు. ఇటీవల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ.. మొన్నటి వరకు తన కెరీర్ పై దృష్టిపెట్టానని చెబుతూ వచ్చింది. తనకు సినిమాలే ప్రపంచమని చెప్పింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని తెలిపింది. అయితే, రీసెంట్ గా గేర్ మార్చినట్లు కనిపిస్తోంది.

ఆమెకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారట. ఓ బడా నిర్మాత తనయుడితో పెళ్లి ఫిక్స్ చేశారని ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. వివాహం జరగడం కూడా దాదాపు ఖాయమైందంటున్నారు. ఇలా ఇండస్ట్రీలోని వారు చాలా మంది నిర్మాతలను, ప్రొడ్యూసర్ల కొడుకులను, హీరోల కొడుకులను పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడం కొత్తేమీ కాదంటున్నారు.

కొన్ని సినిమాల్లో నటించిన అమల.. నాగార్జునను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. నాగ్ తనయుడు నాగచైతన్య కూడా సమంతను లవ్వాడి పెళ్లాడాడు. తర్వాతు విడిపోయారనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు హీరోయిన్ వర్ష కూడా తొలుత పెళ్లి చేసుకుని తర్వాత సినిమాల్లో నటించేలా ప్లాన్ చేస్తోందట. ఈ విషయాన్ని పెళ్లి కొడుకు తరఫు వారికి చెబితే వారు ఓకే కూడా చేశారని సమాచారం. వర్ష ఇప్పటి దాకా మిడిల్ క్లాస్ మెలోడీస్, స్వాతిముత్యం, జాను వంటి సినిమాల్లో నటించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -