Shivam Mavi: అదరగొట్టిన శివం మావి.. అరుదైన రికార్డు సొంతం

Shivam Mavi: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఇద్దరు కొత్త ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పించింది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ లేకపోవడంతో టీమిండియా యువ ఆటగాళ్లను పరీక్షించింది. దీంతో శుభమన్ గిల్, శివం మావిలకు తొలి అంతర్జాతీయ టీ20 ఆడే ఛాన్స్ వచ్చింది. అయితే గిల్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కానీ శివం మావి మాత్రం ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టే ప్రదర్శన చేశాడు.

 

 

ముంబైలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలిచిందంటే దానికి కారణం శివం మావి అని చెప్పక తప్పదు. బ్యాటింగ్ పిచ్‌పై 162 పరుగులు మాత్రమే చేసిన భారత్ పూర్తిగా బౌలర్ల ప్రదర్శన మీదే ఆధారపడింది. అయితే ఉమ్రాన్ మాలిక్, శివం మావి లాంటి యువ బౌలర్లు జట్టును గెలిపిస్తారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ వాళ్లిద్దరి ప్రదర్శన చూశాక అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

 

శ్రీలంకతో తొలి టీ20లో శివం మావి సత్తా చాటాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఈ ప్రదర్శన చేయడంతో మావి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో డెబ్యూ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కేవలం ఇద్దరు టీమిండియా బౌలర్లు మాత్రమే సాధించారు. ఇప్పుడు మావి మూడో ఆటగాడిగా వాళ్ల సరసన నిలిచాడు. గతంలో ప్రజ్ఞాన్ ఓజా, బరీందర్ శరణ్ మాత్రమే డెబ్యూ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేశారు.

 

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా దీపక్ హుడా
తొలి టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన శివం మావికి అందరూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కుతుందని ఊహించారు. కానీ అనూహ్యంగా ఆ అవార్డు దీపక్ హుడాను వరించింది. టీమిండియా కష్టాల్లో పడిన వేళ దీపక్ హుడా తెగువ చూపించడంతో ఈ అవార్డు కట్టబెట్టారు. అతడు 23 బంతుల్లో 41 నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అయితే శివం మావి నాలుగు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులను కట్టడి చేశాడు. దీంతో భారత్ విజయం సులువైంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -