Adilabad: పేద మహిళలను టార్గెట్ చేసి అలాంటి పనులకు తెగించిన యువతి?

Adilabad: రోజు రోజుకి సమాజంలో ఆడవారికి రక్షణ కరువవుతోంది. కేవలం మగవారి నుంచి మాత్రమే కాకుండా పలువురు ఆడవారి నుంచి కూడా మిగిలిన ఆడవారికి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు అమాయకమైన ఆడవారిని లోబరుచుకొని వారిని వ్యభిచారం అనే ఊబిలోకి లాగి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు తరచూ వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాలు వెళితే..

 

అదిలాబాద్ జిల్లాలోని న్యూ హౌజింగ్ బోర్డు కాలనీలో మమత అనే ఒక మహిళ గత 15 రోజుల నుంచి నివాసం ఉంటోంది. మమత డబ్బులు సులభంగా సంపాదించే మార్గాలను వెతికగా ఆమెకు వ్యభిచారం నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ఇక అందుకోసం అక్కడే మమత ఒక గదిని అద్దెకు తీసుకుంది. ఆ తర్వాత పేదరికంలో ఉన్న అందమైన మహిళలను మమత టార్గెట్ చేసింది. పేదరికంలో ఉన్న అమాయకమైన అందమైన మహిళలను టార్గెట్ చేసిన మమత ఆ మహిళలకు డబ్బు ఆశ చూపి వ్యభిచారం ఊబిలోకి దింపింది. ఇలా గత 15 రోజుల నుంచి అనేకమంది మహిళలను తన గదిలోకి రప్పించుకొని వ్యభిచారాన్ని కొనసాగిస్తోంది.

 

అయితే మమత చేస్తున్న వ్యవహారాన్ని తొందరగా పసిగట్టిన అక్కడి స్థానికులు వెంటనే ఆమె ఆట కట్టించాలని స్థానికంగా ఉండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మమతా సాగిస్తున్న వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించడంతో ఆ దాడుల్లో ఇద్దరి మహిళలతో పాటు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న వ్యభిచార నిర్వాహకురాలు మమత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -