Director Om Raut: ఆది పురుష్ ట్రోలింగ్ పై మొత్తానికి స్పందించిన దర్శకుడు ఓం రౌత్!

Director Om Raut: ప్రభాస్ వరల్డ్ వైడ్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఆది పురుష్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా టీజర్ ను ఆదివారం రోజున విడుదల చేశారు. ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు కోగా.. ఈ టీజర్ చూస్తే ఆ అంచనాలు బ్రేక్ అయిపోయాయి. ప్రభాస్ అభిమానుల నుంచి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమా టీజర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

యానిమేషన్ గ్రాఫిక్స్ తో ఈ సినిమా తీశారని, కార్టూన్ సినిమా చూసినట్లు అనిపిస్తుందని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఓం రౌత్ ను జనాలు తెగ ఆడిపోసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి దర్శకుడు ఓం రౌత్ స్పందించాడు. టీజర్ విడుదలైన తర్వాత వచ్చే ట్రోలింగ్ గురించి నేను కొంచెం ధైర్యం కోల్పోయిన మాట నిజమే. ఆ ట్రోలింగ్ వల్ల నేనేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆ సినిమాను వెండి తెర పై విడుదల చేయడానికి తీశాము.

థియేటర్ సైజు తాగవచ్చేమో కానీ.. ఆ పరిమాణాన్ని మరీమొబైల్ కి తగ్గించకూడదు. అలా చేస్తే అస్సలు బాగోదు. నాకు అవకాశం ఇస్తే యూట్యూబ్లో పెట్టకుండా చేయవచ్చు అది నాకు గంట పని. కానీ అందరికీ పరిచయం చేయాలనే యూట్యూబ్ ఆడియన్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇక చాలా అరుదుగా చూసే వాళ్ళ కోసం ఈ సినిమా తీయలేదు. చాలాకాలంగా థియేటర్ కి దూరమైన వాళ్లు , అలాగే మారుమూల ప్రాంతంలో ఉన్న వారిని ఈ సినిమా చూడ్డానికి రప్పించే ప్రయత్నంలో ఈ సినిమా తీశామని తెలిపాడు.

ఎందుకంటే ఇది రామాయణం. గ్లోబల్ కంటెంట్ కోరుకున్న తర్వాత జనరేషన్ ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తీస్తున్నాం అని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకు వచ్చాడు. అలా అందరికీ అర్థమయ్యే మార్గంలో ఈ సినిమాను వివరించాలని, అందుకే మేము ఈ త్రీడీ మోషన్ క్యాప్చర్ మార్గాన్ని ఎంచుకున్నామని ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఓం రౌత్ చెప్పిన మాటలకు ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -