Adipurush: ఆది పురుష్ సినిమాకి ఎదురైనా మరో కొత్త చిక్కు.. అసలేం జరుగుతుంది?

Adipurush: గత రెండు రోజులుగా ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్న ఆది పురుష్ సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఇవ్వలేకపోతున్నాడు అన్నట్లు అర్థమవుతుంది. ఇలా చెప్పడానికి కారణం ఆదివారం రోజున విడుదలైన టీజర్ అని చెప్పవచ్చు.

ఈ టీజర్ పూర్తిగా యానిమేషన్ గ్రాఫిక్స్ లో కనపడుతుంది. కార్టూన్ సినిమాను 500 కోట్లు ఖర్చుపెట్టి తీశారని కొంతమంది ఈ సినిమాను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే ఈ సినిమా టీజర్ లో కార్టూన్ పోలికలు కనబడుతున్నాయి. ఈ టీజర్ ను డైరెక్టర్ ఓం.. చిన్నపిల్లల తోలుబొమ్మలాటలా క్రియేట్ చేశాడు. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

అయితే తాజాగా ఈ టీజర్ మరో నెగిటివిటీ కి దారి తీసింది. బాయ్ కాట్ ఆది పురుష్ అంటూ ఒక వర్గం పిలుపునిస్తుంది. ముస్లిం అయిన సైప్ అలీం ఖాన్ రావణుడి పాత్ర పోషించడం.. అత‌డి లుక్ ఔరంగ‌జేబు, అల్లావుద్దీన్ ఖిల్జీల‌ను పోలి ఉండ‌డం ఒక వర్గానికి అసలు నచ్చడం లేదు. అసలు సైఫ్ విషయంలో ముందు నుంచే నెగిటివ్ గా ఉండటంవల్ల.. ఇప్పుడు అతని విషయంలో మరింత నెగెటివిటీ మొదలు అయ్యింది.

అది ఇప్పుడు తీవ్ర స్థాయికి దారి తీసింది. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్లు అసభ్యకరంగా కనిపించడంతో ఈ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని ఈ వర్గం పిలుపునిస్తుంది. ప్రస్తుతం బాయ్ కాట్ ఆది పురుష్ అనే హ్యాష్ టాగ్ లు హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభాస్ ఆది పురుష్ సినిమా కి ప్రస్తుతం మరో కొత్త చిక్కు ఎదురైంది. మరి ఈ చిక్కులన్నీ ఎదుర్కొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో రాదో తెలియడం లేదు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -