Adipurush Teaser Mistakes: ఆదిపురుష్ టీజ‌ర్‌ రివ్యూ.. టాప్ 5 మిస్టేక్స్ ఇవే!

Adipurush Teaser Mistakes: ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఆదిపురుష్ టీజర్ ప్రభాస్ అభిమానులకు బాగానే నచ్చినా సాధారణ అభిమానులను మాత్రం ఈ టీజర్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే టీజర్ లోని 5 తప్పుల గురించి సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

 

1) దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ కాకపోయినా ఆదిపురుష్ టీజర్ ను చూస్తుంటే ప్రేక్షకులకు యానిమేషన్ మూవీ టీజర్ ను చూస్తున్న భావన కలుగుతోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ జోలికి పోకుండా సాధారణంగా ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేదని ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.

2) టీజర్ లో గ్రాఫిక్స్ ఆశించిన క్వాలిటీతో లేకపోవడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. బాహుబలి, బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలలో కూడా గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉన్నా ఏది ఒరిజినల్ ఏది గ్రాఫిక్స్ అని గుర్తు పట్టలేనంత అద్భుతంగా రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నారు. ఓం రౌత్ మాత్రం గ్రాఫిక్స్ పై శ్రద్ధ పెట్టకపోవడంతో టీజర్ లోని కొన్ని షాట్స్ మరీ సిల్లీగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

3) ఆదిపురుష్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటానికి ప్రభాస్ కారణమనే సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ టీజర్ లో రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ ఆకట్టుకునేలా లేదు. ఆదిపురుష్ టీజర్ లో కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్లలోనే ప్రభాస్ అందంగా కనిపించారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

4) ఆదిపురుష్ టీజర్ లోని హనుమాన్ విజువల్స్ సైతం ఆకట్టుకునే విధంగా లేవు. హనుమంతుని పాత్ర విషయంలో దర్శకుడు ఓం రౌత్ కనీస జాగ్రత్తలు తీసుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. హనుమంతుని పాత్ర ఆదిపురుష్ కు కీలకం కాగా ఆ పాత్ర విషయంలో దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

5) ఆదిపురుష్ టీజన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం ఆశించిన రేంజ్ లో లేదు. బీజీఎం మరీ రొటీన్ గా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


టీజర్ విషయంలో జరిగిన పొరపాట్లు సినిమా విషయంలో జరగకుండా ఉండాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఆ సమయానికి మేకర్స్ తప్పులను సరిదిద్దుకుని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఆదిపురుష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -