Adipurush: మరో వివాదంలో నిలిచిన ఆదిపురుష్.. పోస్టర్ లో ఏకంగా ఇన్ని తప్పులా?

Adipurush: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్. గత ఏడాది ఈ టీజర్ విడుదల అయిన విషయం తెలిసిందే. కానీ ఊహించని విధంగా భారీగా విమర్శలను ఎదుర్కొంది. దాంతో ఈ సినిమాను మళ్ళీ ఎడిట్ చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం. అంతేకాకుండా ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ను మార్చేందుకు సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. సినిమా గ్రాఫిక్స్ ను మార్చేందుకు సమయం తీసుకున్న ఆదిపురుష్ మూవీ మేకర్స్ సంవత్సరమైన సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ ను విడుదల చేయలేదు.

ఇది ఇలా ఉంటే నేడు అనగా మార్చి 30 న శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. రామాయణ ఘట్టానికి చెందిన ఐకానిక్ పోస్టర్ ను తమదైన శైలిలో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ పై కూడా మరోసారి విమర్శలు చెలరేగాయి. రామాయణం అనగానే మనకు ఎక్కువగా కొన్ని రకాల గెటప్ లు గుర్తుకు వస్తూ ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు చూసిన పాత సినిమాల్లో కూడా గెటప్పులు దాదాపు ఇలానే ఉంటాయి. కానీ దానికి పూర్తి భిన్నంగా ఉంది ఆదిపురుష్ పోస్టర్ ఉంది.

 

రాముడికి తలపై కిరీటం లేదు. అలాగే అతనికి ఇచ్చిన దుస్తుల్లో, లుక్స్ లో సాత్వికం కనిపించలేదు.
ఇక సీత లుక్ పై రాముడి లుక్ కంటే ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఓ శాలువ లాంటిది కప్పడం విమర్శలకు తావిస్తోంది. అటు లక్ష్మణుడి పాత్రలో కూడా భక్తిభావం కాకుండా, వీరత్వం కనిపిస్తోంది. అతడికిచ్చిన దుస్తులు కూడా లెదర్ ను పోలి ఉన్నాయి. ఇలా తాజాగా విడుదల చేసిన ఆది పురుష్ కొత్త పోస్టర్ పై ఓ రేంజ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఆదిపురుష్ సినిమాను చూడాలనుకుంటే, ఈ గెటప్స్ కు అలవాటు పడాల్సిందే అన్నట్టుగా ఇలా ముందుగా పోస్టర్ రిలీజ్ చేసినట్టుంది అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న విమర్శలను బట్టి చూస్తే ఆది పురుష్ సినిమా విడుదల అయినా కూడా ఆదరించే వారు చాలా తక్కువగా ఉంటారు అన్నట్టు పరిస్థితులు ఉంటాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాను జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రం బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూడగా విడుదల చేసిన ఒక్క పోస్టర్ పై ఇన్ని రకాల విమర్శలు వినిపించడంతో దర్శకుడు ఓం రౌత్ పై మండిపడుతున్నారు అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -