Aftab: అప్పుడే కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఏకంగా శ్రద్దా ఉంగరంతో ప్రపోజ్?

Aftab: గత కొన్ని రోజుల నుండి శ్రద్దా వాకర్ అనే యువతి హత్య కేసు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా తనను ఘోరంగా చంపి చివరికి తన మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి అడవి ప్రాంతంలో పడేశాడు. ఒక మాస్టర్ ప్లాన్ తోనే తన గర్ల్ ఫ్రెండ్ ని చంపాడు. ఇక 2020లో శ్రద్దా పోలీసులకు రాసిన లెటర్ కూడా ఇటీవలే దొరికిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో తన బాయ్ ఫ్రెండ్ తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని కొన్ని విషయాలు బయటపడ్డాయి.

 

అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈ కేసు విషయంలో రోజుకొక షాకింగ్ నిజాలు బయట పడుతున్నాయి. అయితే తాజాగా అఫ్తాబ్ శ్రద్దా ఉంగరాన్ని కొత్త గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించడంతో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తన గర్ల్ ఫ్రెండ్ ని చంపిన తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారపు ఉంగరం తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ నేరస్తుడు.

 

ఆ తర్వాత ఆ నేరస్తుడు మరో అమ్మాయిని తన మాయ మాటలతో వలలో వేసి తనను తన ఇంటికి రప్పించుకున్నాడు. ఆ అమ్మాయికి ఆ బంగారపు ఉంగరం ఇచ్చి గిఫ్ట్ గా ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో ఆమెను విచారించగా ఆమె జరిగిన విషయం మొత్తం బయట పెట్టింది. తనను అతడు ఇంటికి పిలిచి బంగారపు ఉంగరం గిఫ్ట్ గా ఇచ్చాడని తెలిపింది. పోలీసులు ఆ ఉంగరం స్వాధీనం చేసుకొని శ్రద్దా తండ్రికి చూపించగా అది తమ కూతురిదే అని వాళ్ళు తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు...
- Advertisement -
- Advertisement -