ETV Prabhakar: నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

ETV Prabhakar: బుల్లితెర మెగాస్టార్ గా ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు ప్రభాకర్. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాగే వెండితెరపై పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. బుల్లితెర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాకర్ తన కుమారుడు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేయబోతున్నానంటూ ఒక వేదిక ద్వారా వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉండగా చంద్రహాస్ మాత్రం వెనుక నిలబడి తన యాటిట్యూడ్ చూపించారు. జోబులో చేతులు పెట్టుకొని అటు ఇటు కదులుతూ ఓ రేంజ్ లో యాటిట్యూడ్ కనపరచడంతో పెద్ద ఎత్తున చంద్రహాస్ ను కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఈయన సినిమా ఒకటి కూడా విడుదల కాకుండానే ఇంతగా యాటిట్యూడ్ చూపించడం అవసరమా అంటూ తనని యాటిట్యూడ్ స్టార్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ విధంగా తన కొడుకు గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంతో ఈ వార్తలపై స్పందించిన ప్రభాకర్ ప్రస్తుతం తన కుమారుడికి పబ్లిసిటీ కావాలి అది మంచైనా చెడైనా పబ్లిసిటీ అవసరం.ఇలా వాడికి కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. అయితే మునుముందు తాను ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటాడు ఇప్పుడు విమర్శించిన వారే తన నటన చూసి ప్రశంసలు కురిపిస్తారు అంటూ ఈయన స్పందించారు.

ఇలా గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రభాకర్ తాజాగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ఉప్పల్ స్టేడియంలో సందడి చేశారు.ఈ క్రమంలోనే తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చంద్రహాస్ జాతీయ జెండాను పట్టుకొని పెద్ద ఎత్తున సందడి చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరికొంతమంది ఈ ఫోటోల పై స్పందిస్తూ నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -